India EXIM Bank Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్.. మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్.. 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి కనీసం 50 శాతం మార్కులతో లా స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, గ్రాడ్యుయేషన్/ఎంబీఏ/పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా/పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్ 4, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 4, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్/మహిళా అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష నవంబర్, డిసెంబర్ 2022 నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ జనవరి/ఫిబ్రవరి 2023లో ఉంటాయి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.69,810ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- మేనేజర్ (లా) పోస్టులు: 2
- మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులు: 2
- మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు: 41
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.