Nainital Bank Recruitment 2022: బ్యాంక్ జాబ్స్! నైనిటాల్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హతలు అవసరం..
భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్.. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..
భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్.. 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్‌లోని ఎన్‌బీఎల్ శాఖల్లో పనిచేయవల్సి ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్‌పై అవగాహన ఉండాలి. బ్యాంకింగ్/ఫైనాన్షియల్/ఇన్‌స్టిట్యూషన్స్/ఎన్‌బీఎఫ్‌సీలలో 1 నుంచి 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్ 30, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 21 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రూ.1000లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష నవంబర్ 13వ తేదీన నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.36,000ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం..
మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు గానూ 200 మార్కులకు 145 నిముషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
- రీజనింగ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
- ఇంగ్లిష్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
- జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
- కంప్యూటర్ నాలెడ్జ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.