AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag Thakur: గుజరాత్‌, కేంద్రం బీజేపీదే.. గత రికార్డులన్నీ బద్దలు కొడతాం.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్..

గుజరాత్‌లో బీజేపీ గాలి వీస్తోందని.. ఈ సారి గత రికార్డులన్నీ బ్రేక్ అవ్వడంతోపాటు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ధీమా వ్యక్తంచేశారు.

Anurag Thakur: గుజరాత్‌, కేంద్రం బీజేపీదే.. గత రికార్డులన్నీ బద్దలు కొడతాం.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్..
Anurag Thakur
Shaik Madar Saheb
|

Updated on: Oct 16, 2022 | 6:02 PM

Share

గుజరాత్‌లో బీజేపీ గాలి వీస్తోందని.. ఈ సారి గత రికార్డులన్నీ బ్రేక్ అవ్వడంతోపాటు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ధీమా వ్యక్తంచేశారు. ఈ సారి కూడా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ప్రభుత్వం 2024లో 400 పార్లమెంటు స్థానాలను గెలుచుకుని.. తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని మల్వాన్ గ్రామంలో ఆదివారం జరిగిన బీజేపీ ‘గౌరవ యాత్ర’లో ఠాకూర్ పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో హిందూ చిహ్నాలు గౌరవించబడుతున్నాయని, అయోధ్యలో రామ మందిరం కల సాకారమైందని ఠాకూర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. గతంలో ఒక ఇటలీ మహిళ ప్రధాని మోడీని అవమానించారని.. ఇప్పుడు ఒక ఇటాలియా మోడీ తల్లిని అవమానిస్తున్నారంటూ.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆప్‌ నేత గోపాల్‌ ఇటాలియాల పేర్లను ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శించారు.

గుజరాత్ అవమానాన్ని ఎన్నడూ అంగీకరించలేదని.. తగిన సమాధానం చెబుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించినందుకు ప్రధాని మోడీని ఠాకూర్ ఆదివారం ప్రశంసించారు. ఇది సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..