Gujarat Elections 2022: మిషన్ గుజరాత్.. వ్యూహాత్మకంగా కేజ్రీవాల్ అడుగులు.. ఐదో విడత లిస్ట్ విడుదల..
గుజరాత్‌లో పాగా వేసేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది ఆప్.. అభ్యర్థుల ప్రకటనలో ఆప్ పార్టీ దూసుకుపోతుంది.. మరోవైపు గుజరాత్ కింగ్ మేకర్‌గా కేజ్రీవాల్ మారుతారన్నారు శతృఘ్న సిన్హా
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించక ముందే అభ్యర్థుల జాబితా విడుదలలో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది.తాజాగా అభ్యర్థుల ఐదవ జాబితాను ఆదివారం నాడు ఆప్ విడుదల చేసింది. ఈ జాబితాలో 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.. మరోవైపు గుజరాత్‌పై మార్పు తుఫాన్ దూసుకుపోతోందని తమ పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్‌లో 27 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, ఆప్‌కు ఓటేయడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కేజ్రీవాల్ ప్రస్తుతం రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.
ఇక హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీఎంసీ ఎంపీ, నటుడు శతృఘ్న సిన్హా భిన్నమైన జోస్యం చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కింగ్ కాకపోయినా.. ఆయన మాత్రం కింగ్ మేకర్‌గా మారుతారని చెప్పారు. త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నరేంద్ర మోదీని మరింత బలహీనంగా మార్చుతాయన్నారు.
182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లోగా ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల తరహాలో కాకుండా ఈసారి గుజరాత్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఇంతవరకూ ప్రధానంగా పోటీ ఉండేది.ఈసారి ఆప్ ఆద్మీ పార్టీ పూర్తి శక్తిసామర్థ్యాలతో బరిలోకి దిగడంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. ప్రస్తుత గుజరాత్ అసెంబ్లీ గడువు 2023 ఫిబ్రవరి 18వ తేదీతో ముగియనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..