Diwali Gift: అదృష్టవంతులు సామీ.. దీపావళి కానుకగా ఉద్యోగులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్టులు.. ఎక్కడంటే..?

దీవాళి గిఫ్ట్‌గా తన ఉద్యోగులకు కార్లు, బైక్స్‌ అందించారు ఓ బిజినెస్‌మెన్‌. సుమారు కోటిన్నర విలువైన బహుమతులను అందజేశారు.

Diwali Gift: అదృష్టవంతులు సామీ.. దీపావళి కానుకగా ఉద్యోగులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్టులు.. ఎక్కడంటే..?
Diwali Gift
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 17, 2022 | 6:45 AM

దీపావళి అంటే వెలుగుల పండగ.. చీకటిని పారద్రోలుతూ జరుపుకునే ఫెస్టివల్‌.. దీపావళి తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఇక, దీపావళి వస్తోందంటే ఎవరి స్థోమతకు తగ్గట్టుగా స్వీట్లు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సంప్రదాయం. బడా కంపెనీలైతే, తమ ఉద్యోగులను భారీ గిఫ్ట్‌లతో సర్‌ప్రైజ్‌ చేస్తుంటాయి. ఎంతోమంది బిజినెస్‌మెన్లు.. తమ ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ప్లాట్లు, బహుమతులుగా ఇచ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే.. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ బిగ్‌ బిజినెస్‌మెన్‌ ఇప్పుడు అదే చేశాడు. తన ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైక్స్‌ను దీవాళి కానుకగా అందజేశాడు. కంపెనీలో ఉత్తమ ప్రతిభకనబర్చిన ఉద్యోగులకు సుమారు కోటిన్నర రూపాయల విలువైన బహుమతులను చలని జువెలర్స్‌ అధినేత జయంతిలాల్‌ ఇచ్చారు.

దీపావళి కానుకగా మొత్తం 8 కార్లు, 18 బైక్స్‌ను దీవాళి గిఫ్ట్స్‌గా అందించి సర్‌ప్రైజ్‌ చేశారు. ఉద్యోగులు కూడా తన ఫ్యామిలీ మెంబర్స్‌లాంటివాళ్లే అన్నారు జయంతిలాల్‌. ఉద్యోగుల కష్టానష్టాల్లో కంపెనీ తోడుగా ఉంటుందని, అలాగే సంతోషాలను కూడా పంచుకుంటుందని తెలిపారు. అందుకే, దీపావళి కానుకగా కార్లు, బైక్‌లను బహుమతులుగా ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఉద్యోగుల్లో నూతనోత్సాహం నింపడానికి, మరింత డెడికేటెడ్‌గా పనిచేయగానికి ఇది దోహదపడుతుందని జయంతిలాల్‌ పేర్కొన్నారు.

ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్లే తమ కంపెనీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. ఉద్యోగుల కృషితో కంపెనీకి వచ్చిన లాభాల్లో నుంచే ఈ గిఫ్ట్‌లు అందించినట్లు తెలిపారు. వీళ్లంతా కేవలం ఉద్యోగులు కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్‌ అంటూ జయంతిలాల్‌ చెప్పడంతో ఎంప్లాయిస్ అంతా సంతోషంలో మునిగితేలిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..