Health Tips: ఉదయాన్నే నిద్ర లేవగానే బద్ధకం వస్తుందా? త్వరగా మేల్కొనలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి

ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం చాలా అవసరం.. సరైన జీవనశైలిని అలవర్చుకోకపోతే.. ప్రమాదంలో పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Health Tips: ఉదయాన్నే నిద్ర లేవగానే బద్ధకం వస్తుందా? త్వరగా మేల్కొనలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి
Wake Up Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 16, 2022 | 9:46 PM

ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం చాలా అవసరం.. సరైన జీవనశైలిని అలవర్చుకోకపోతే.. ప్రమాదంలో పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత బిజీలైఫ్‌లో చాలామంది పూర్తిగా నిద్రపోలేకపోతున్నారు. లేటుగా నిద్రపోవడం, అర్ధరాత్రుల్లో తినడం, ఉదయంలో ఎక్కువగా నిద్రించడం లాంటి కారణాల వల్ల ఉదయాన్నే లేవడం కష్టంగా మారుతుంది. సాధారణంగా ఆరోగ్య నిపుణులు 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలని ప్రతిఒక్కరికీ సిఫార్సు చేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ చిట్కాలను పాటించలేరు. ఆపై ఉదయం నిద్రలేవడానికి సమయం అవుతున్నప్పుడు.. నిద్ర కళ్ల మీద ఉండగానే.. మేల్కొంటారు. ఇంకా కొంతమంది చాలా లేటుగా నిద్రలేస్తారు. దీంతో శరీరం అలసిపోతుంది. ఇంకా శరీరమంతటా చాలా నొప్పిగా, నీరసంగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే కొన్ని చిట్కాలను అవలంభించడం మంచిది. ఈ నివారణలతో ఉదయాన్నే నిద్ర లేవడానికి ఇబ్బంది పడే సమస్య నుంచి బయటపడొచ్చు రోజంతా చురుకుగా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అలారం దూరంగా ఉంచండి: సెల్ ఫోన్ల ట్రెండ్ రాకముందు అలారం గడియారాన్ని ఎక్కువగా వాడేవాళ్లం. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత మొబైల్ లోనే అలారం సౌకర్యం ఉంది. కానీ దాని సమస్య ఏమిటంటే ఫోన్‌లో తాత్కాలికంగా ఆపివేసే బటన్ ఉంటుంది. ఇంకా కాసేపు పొడగించవచ్చు కూడా. దీని కారణంగా మంచం మీద నుంచి బయటపడటం ఆలస్యం అవుతుంది. అందువల్ల, మొబైల్ ఫోన్‌ను చేతులకు అందకుండా దూరంగా ఉంచండి. దీంతో అలారం సెట్ చేసిన సమయానికి మోగుతుంది.. మీరు సమయానికి నిద్ర నుంచి మేల్కొంటారు. ఇలా చేయడం వల్ల అలారం ఆఫ్ చేయడానికి మంచం మీద నుంచి లేవాల్సి వస్తుంది.. దీంతో నిద్ర కూడా పోతుంది.

గోరువెచ్చని నీరు తాగండి: భారతదేశంలో చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంది. దీనిని బెడ్ టీ అని కూడా పిలుస్తారు. కానీ అలా చేయడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు వస్తాయి. అందువల్ల, టీ తాగడానికి బదులుగా మీరు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. దీని కారణంగా మన శరీరం వెంటనే చురుకుగా మారుతుంది. మలబద్ధకం, ఎసిడిటీ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కావాలంటే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకోని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

నడకకు వెళ్లండి: పైన పేర్కొన్న చర్యలతోపాటు నడక చాలా విధాలుగా మేలు చేస్తుంది. నిద్ర పూర్తి కానప్పుడు, నీరసమైన భావన ఉన్నప్పుడు మీరు ఉదయం నడకకు వెళ్లడం చాలా ముఖ్యం. 20 నుంచి 30 నిమిషాలు నడవడానికి ప్రయత్నించండి. తద్వారా మీ శరీరం చురుకుగా మారుతుంది.. తిరిగి పడుకోవలసిన అవసరం ఉండదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి