Covid Study: కోవిడ్‌ బారిన పడిన వారిలో మరిన్ని సమస్యలు.. అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు

దేశంలో కరోనా విధ్వంసం సృష్టించింది. ప్రతి ఇంట్లో ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. డెల్టా వేరియంట్ వేలాది మందిని బలి తీసుకుంది. నేటికీ కరోనా వైరస్‌పై ప్రజలు భయాందోళనలకు..

Covid Study: కోవిడ్‌ బారిన పడిన వారిలో మరిన్ని సమస్యలు.. అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు
Breathlessness
Follow us

|

Updated on: Oct 16, 2022 | 9:50 PM

దేశంలో కరోనా విధ్వంసం సృష్టించింది. ప్రతి ఇంట్లో ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. డెల్టా వేరియంట్ వేలాది మందిని బలి తీసుకుంది. నేటికీ కరోనా వైరస్‌పై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా ఎంతో మందిని బలి తీసుకోగా,  దాని బారిన పడిన బాధితులు ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. కరోనా మరో రూపం తెరపైకి వస్తోంది. అదే లాంగ్ కోవిడ్. తాజాగా దీనికి సంబంధించిన ఓ అధ్యయనం జరిగింది. దీర్ఘకాలంగా కోవిడ్-19 బాధితులుగా మారిన వారి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనం తెలిపింది. కోవిడ్ -19 ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, క్రమం తప్పకుండా చికిత్స పొందాలని వైద్యులు చెబుతున్నారు.

వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాస ఆడకపోవడం

మీడియా నివేదికల ప్రకారం.. కార్డియోపల్మనరీ వ్యాయామం ద్వారా కోవిడ్ ప్రభావం ప్రజలపై తీవ్రంగా చూపింది. కార్డియోపల్మోనరీ వ్యాయామం సైక్లింగ్ లేదా ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం ద్వారా పరీక్షించబడింది. అధ్యయనం కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో లాంగ్ కోవిడ్ బారిన పడిన ఒక గ్రూపు ఉండగా, కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న గ్రూపు. లాంగ్ కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులు వ్యాయామం చేయలేకపోతున్నారు. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. అయితే ఇతర గ్రూపులోని వ్యక్తులు వ్యాయామం చేయడంలో ఎటువంటి సమస్యను ఎదుర్కొలేదు.

గత మూడేళ్లలో కోవిడ్‌ బారిన పడిన వారు ఇప్పటికే పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్యుల విచారణలో తేలింది. వీరిలో 50 శాతం మంది మానసిక రోగులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో డిప్రెషన్, ఆందోళన సమస్య ఎక్కువగా కనిపించింది. 26% మంది సరిగ్గా నిద్రపోలేకపోతున్నారని గుర్తించారు. కొందరిలో కోపం పెరిగింది. పెద్దలు, వృద్ధులలో కనిపిస్తే, ఈ సమస్య 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో 50% మంది ఆందోళన చెందుతున్నట్లు అధ్యయనం ద్వారా గుర్తించారు వైద్యులు. లాంగ్ కోవిడ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయి

రోగులలో ఇతర లక్షణాలు కూడా కనిపించాయి. వారికి ముక్కు కారటం, తలనొప్పి, తుమ్ములు, నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొన్నిసార్లు జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు పరిశోధకులు. కోవిడ్‌ సమయంలో, తర్వాత వ్యక్తులలో అలసట ఎక్కువగా కనిపించింది. వివిధ సమయాల్లో వివిధ లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ నొప్పి, నిద్ర సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపించినట్లు అధ్యయనం ద్వారా గుర్తించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!