Pit Bull Dog: మరో షాకింగ్ ఇన్సిడెంట్.. తల్లీ, పిల్లలపై పిట్‌బుల్ దాడి.. తీవ్రగాయాలతో..
దేశంలోని చాలా ప్రాంతాల్లో శునకాల దాడుల ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల యూపీ, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో పెంపుడు జంతువులు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి.
దేశంలోని చాలా ప్రాంతాల్లో శునకాల దాడుల ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల యూపీ, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో పెంపుడు జంతువులు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. పిట్ బుల్ జాతికి చెందిన శునకం.. యూపీలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో ఓ వృద్ధురాలిని చంపిన ఘటన కలకలం రేపింది. ఇంకా నోయిడాలో మరో పిట్‌బుల్ శునకం కొందరిపై దాడి చేసి గాయపరిచింది. ఇలా దేశవ్యాప్తంగా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా.. ఓ శునకం మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని బలియార్ ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. మహిళతోపాటు.. ఆమె ఇద్దరు పిల్లలపై పిట్ బుల్ కుక్క దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చేరిన మహిళకు కాలు, చేయి, తలపై 50 కుట్లు పడ్డాయని ఆమె కుటుంబ సభ్యులు, వైద్యులు తెలిపారు. ఇద్దరు చిన్నారులు శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని.. మహిళకు చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై గ్రామ మాజీ సర్పంచ్ సూరజ్ మాట్లాడుతూ.. శుక్రవారం తన భార్యతో కలిసి ఇంటికి రాగానే పెంపుడు కుక్క తన భార్యపై దాడి చేసిందని తెలిపారు. ఇద్దరు పిల్లలపై కూడా పెంపుడు జంతువు దాడి చేసినట్లు వెల్లడించారు.
వారి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు కుక్క నుంచి మహిళను, పిల్లలను రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కుక్కను చాలాసార్లు కర్రలతో కొట్టినా అది ఆగలేదని.. మరింత దూకుడుగా దాడి చేసి కరిచిందని సూరజ్ చెప్పాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..