Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Mantra: ప్రేమకు మొదటి మెట్టు నమ్మకమే.. ఈరోజు విశ్వాసానికి సంబంధించిన 5 ప్రేరణాత్మక వ్యాఖ్యలు తెలుసుకోండి..

అదే విశ్వాసం కోల్పోవడానికి క్షణ కాలం సరిపోతుంది. నమ్మకానికి సంబంధించిన అమూల్యమైన స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యల గురించి తెలుసుకుందాం.. ఏ సంబంధాన్ని అయినా బలోపేతం చేసే దిశా అడుగులు వేస్తే.. జీవితంలోని చీకటిలో వెలుగుగా పని చేస్తాయి. 

Success Mantra: ప్రేమకు మొదటి మెట్టు నమ్మకమే.. ఈరోజు విశ్వాసానికి సంబంధించిన 5 ప్రేరణాత్మక వ్యాఖ్యలు తెలుసుకోండి..
Success Mantra
Follow us
Surya Kala

|

Updated on: Oct 18, 2022 | 8:26 AM

జీవితంలో మనందరికీ ఏదో ఒక సమయంలో ఏదొక విషయంపై నమ్మకం, విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంబంధానికి పునాది ఈ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. విశ్వాసం భగవంతుడిపైనా లేదా స్నేహితుడిపైనా లేదా ఆత్మీయుడిపైనా, అతని సహాయంతో, మనం చాలా కష్టమైన సవాలును చాలా తేలికగా ఎదుర్కొంటాం. కానీ మనం ఎవరినైనా అనుమానించడం ప్రారంభించినప్పుడు విశ్వాసం , నమ్మకం బలహీన పడడం ప్రారంభమవుతుంది. దీంతో ఆ వ్యక్తి మళ్లీ మళ్లీ తప్పులమీద తప్పులను చేయడం ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని.. అయితే అదే విశ్వాసం కోల్పోవడానికి క్షణ కాలం సరిపోతుంది. నమ్మకానికి సంబంధించిన అమూల్యమైన స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యల గురించి తెలుసుకుందాం.. ఏ సంబంధాన్ని అయినా బలోపేతం చేసే దిశా అడుగులు వేస్తే.. జీవితంలోని చీకటిలో వెలుగుగా పని చేస్తాయి.

  1. నమ్మకం అనేది మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. జీవితంలో ఏదైనా తప్పు జరిగితే ఆ సంబంధం పై తీవ్ర ప్రభావం జరుగుతుంది.
  2. నమ్మకం లేని బంధం ఇంధనం లేని కారు లాంటిది. అందులో మీరు ఏది కావాలంటే అలా జీవించవచ్చు. ఇంధనం లేని కారు ముందుకు సాగదు.
  3. ఆత్మవిశ్వాసం అనేది జీవితంలో పోగొట్టుకోవడం అత్యంత సులభమైన విషయం. అయితే ఆత్మవిశ్వాసం తిరిగి పొందడం ప్రపంచంలోనే కష్టతరమైనది.
  4. నమ్మకం ఒక గాజు పాత్ర వంటిది. ఒక్కసారి పగిలిన గాజు.. ఎలా అతుక్కోదో.. అదే విధంగా నమ్మకం పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ సంపాదించుకోలేము.
  5. జీవితంలో విశ్వాసం పక్షి లాంటిది.. తెల్లవారుజామున చీకటిలో కూడా కాంతిని ప్రసరింజేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)