Solar eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఇవి.. తప్పక తెలుసుకోండి

అందుకే గ్రహణం ముగిసే వరకు ఆలయాలు మూసి ఉంటాయి. అందుకే అక్టోబరు 25న తెల్లవారుజామున 2.28 గంటల నుంచి ఆలయాల్లో పూజలు ఉండవు. ఈ కాలంలో

Solar eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఇవి.. తప్పక తెలుసుకోండి
Solar Eclipse 2022
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 20, 2022 | 6:40 PM

సూర్య గ్రహణం:  ఈ ఏడాది చివరి సూర్యగ్రహణాన్ని అక్టోబర్ 25న ప్రపంచం చూడనుంది. ఈ సంవత్సరం వచ్చే సూర్యగ్రహానికి చాలా ప్రముఖ్యత ఉంది. సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుంది.. భారతదేశంలో కనిపిస్తుంది. అయితే ఈ సూర్య గ్రహం హిందువులకు ఎంతో ప్రముఖ్యమైన దీపావళి పండగ రోజున రాబోతోంది. ఇకపోతే, ఈ రోజున మీరు ఏం చేయాలిక..? ఏం చేయకూడదు అనే దానిపై శ్రద్ధ వహించండి. అక్టోబర్ 25 న సూర్యగ్రహణం సమయంలో అనుసరించాల్సిన నియమాలు ఇక్కడ తెలుసుకుందాం..

హిందూ క్యాలెండర్ ప్రకారం, పవిత్ర కార్తీక మాసంలో అక్టోబర్ 25 (మంగళవారం) అన్ని రాష్ట్రాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం మధ్యాహ్నం 2.28 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.29 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సాయంత్రం 6.32 గంటల వరకు కొనసాగుతుంది. అందుకే గ్రహణం ముగిసే వరకు ఆలయాలు మూసి ఉంటాయి. అందుకే అక్టోబరు 25న తెల్లవారుజామున 2.28 గంటల నుంచి ఆలయాల్లో పూజలు ఉండవు. ఈ కాలంలో ఆహారం తయారీ, వినియోగం ఖచ్చితంగా నివారించబడుతుంది. అక్టోబరు 25న పుణ్యస్నానానంతరం సాయంత్రం 6.32 తర్వాత మతపరమైన ఆచార వ్యవహారాలు ప్రారంభమవుతాయి.

చంద్రుడు సూర్యునికి భూమికి మధ్య వెళుతున్నప్పుడు, సూర్యుని కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకుంటుంది. ఇది సూర్యగ్రహణం. సూర్యగ్రహణం ఖగోళ సంబంధమైన సంఘటన అయినప్పటికీ, భారతీయ సంస్కృతిలో దీనికి పౌరాణిక, జ్యోతిషశాస్త్ర సంబంధము ఉంది.

ఇవి కూడా చదవండి

పురాణాల ప్రకారం, రాహువు అనే రాక్షసుడు సముద్ర మథనం సమయంలో అమృతాన్ని పొందేందుకు దేవుడి వేషంలో చంద్రుడు, సూర్య భగవానుడి మధ్యలో కూర్చున్నాడు. విష్ణువు అతనికి అమృతం ఇస్తున్నప్పుడు, సూర్యుడు చంద్రులు అతను అసురుడు అని చెప్పారు. అమరత్వాన్ని పొందేందుకు రాహువు తనను మోసగించి అమృతాన్ని పొందాడని గ్రహించిన విష్ణువు వెంటనే రాహువు తలను నరికివేశాడు. అప్పటికే విష్ణువు ఇచ్చిన అమృతం ఆ రాక్షసుని కంఠంలోంచి పోయింది. అలా రెండుగా చీలిపోయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ రెండు భాగాలను,.. తల భాగాన్ని ‘రాహు’ అని, శరీర భాగాన్ని ‘కేతు’ అని పిలిచేవారు. రాహువు, కేతువులకు సూర్యచంద్రులపై పగబట్టడాని, గ్రహణాల ద్వారా ప్రతీకారం తీర్చుకోవడానికి తరచుగా ప్రయత్నిస్తాడని నమ్ముతారు.ఈ క్రమంలోనే గ్రహణ కాలంలో పురాతన కాలం నుండి భారతదేశంలో సాంప్రదాయకంగా అనేక నియమాలు

సూర్యగ్రహణం సమయంలో అనుసరించాల్సినవి..

1. సూర్యగ్రహణానికి ముందు మరియు తరువాత స్నానం చేయండి. 2. గ్రహణానికి కనీసం రెండు గంటల ముందు ఆహారం తీసుకోండి. 3. సూర్యగ్రహణం సమయంలో ధ్యానం చేయండి. సూర్యగ్రహణం సమయంలో శివుడు, గురువు, విష్ణువు స్తోత్రాలను పఠించండి. 4. చెడు ప్రభావాన్ని నివారించడానికి పవిత్ర తులసి ఆకులను నీటి పాత్రలలో ఉంచండి. 5. సూర్యగ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఇంటి చుట్టూ గంగాజలం చల్లాలి. ఇది సానుకూలతను తెస్తుంది.. గ్రహణం యొక్క చెడు ప్రభావాల నుండి రక్షిస్తుంది.

సూర్యగ్రహణం సమయంలో చేయకూడనివి..

1. గ్రహణం సమయంలో సూర్యునికి నేరుగా శరీరం బహిర్గతం కాకుండా ఉండండి. 2. గ్రహణ సమయంలో వంట చేయడం, తినడం మానుకోండి. 3. సూర్యుడిని కంటితో చూడవద్దు. 4. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు రాకూడదు. 5. గ్రహణానికి ముందు వండిన ఆహారం తినకూడదు. గ్రహణానికి ముందు నీరు, అన్నం, ఇతర ఆహార పదార్థాలపై తులసి ఆకుల్ని వేయండి. 6. గ్రహణం సమయంలో నిద్రించడం లేదా బయటికి వెళ్లడం మానుకోండి. 7. మీ ఇంటి నుండి సూర్యరశ్మిని దూరంగా ఉంచండి. మీ తలుపులను కర్టెన్లతో కప్పండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి