AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking News: అతడు విసిరేసిన కాపీ స్లిప్‌‌ను ఆమె లవ్ లెటర్ అనుకుంది.. ఆపై ఊహించని దారుణం

తన కూతురు పరీక్షలు రాసి ఇంటికి వస్తుండగా.. ఓ అబ్బాయి తనకు ప్రేమలేఖ రాశాడని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి, సోదరులు బాలుడిని పట్టుకుని కొట్టి చంపారు. అనంతరం అతని మృతదేహాన్ని

Shocking News: అతడు విసిరేసిన కాపీ స్లిప్‌‌ను ఆమె లవ్ లెటర్ అనుకుంది.. ఆపై ఊహించని దారుణం
Crime
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2022 | 6:46 PM

Share

ఒక్కోసారి మన గ్రహచారం సరిగ్గా లేకుంటే తాడే పామై కాటువేస్తుందంటారు..ఇది ఎప్పట్నుంచో వాడుకలో ఉన్న సామెత.. మహారాష్ట్ర సమీపంలోని పాట్నాకు చెందిన ఓ కుర్రాడి కథ సరిగ్గా ఈ సామెతను పోలి ఉంది. అతడు పరీక్షలో కాపీ చేయడానికి స్లిప్ రాసుకున్నాడు. అయితే ఆ స్లిప్ పరీక్ష హాల్‌లోని వెనుక డెస్క్‌లో కూర్చున్న అమ్మాయి దగ్గర పడింది. అది చూసి ప్రేమలేఖగా భావించిన సదరు బాలిక..తన కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. తమ కూతురికి ప్రేమలేఖ రాశాడని తెలిసిన వెంటనే ఆ కాగితంలో ఏముందో కూడా చూడకుండా ఆమె కుటుంబీకులు ఆ అబ్బాయిని కొట్టి చంపేశారు. అతి కిరాతకంగా మృతదేహాన్ని నరికివేశారు. పరీక్ష కాపీ కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోవడం విషాద కథ!

తన కూతురు పరీక్షలు రాసి ఇంటికి వస్తుండగా.. ఓ అబ్బాయి తనకు ప్రేమలేఖ రాశాడని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి, సోదరులు బాలుడిని పట్టుకుని కొట్టి చంపారు. అనంతరం అతని మృతదేహాన్ని నరికి ముక్కలుగా విసిరేశారు. రైలు పట్టాలపై ఓ వ్యక్తి శరీర భాగాలు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్టు చేశారు.

బాలుడు చదువుతున్న తరగతిలోనే అతని బంధువు కూడా చదువుతున్నాడు. పరీక్ష ప్రారంభం కాగానే ఆ కుర్రాడు తను రాసిన కాపీ స్లిప్ తీసి చూసుకుని పరీక్ష రాశాడు. తరువాత, తన కజిన్‌కి సహాయం చేయడానికి, అతను ఆమె కూర్చున్న డెస్క్‌పై నోట్‌ను విసిరాడు. అయితే అతని వెనుక కూర్చున్న మరో అమ్మాయికి ఆ స్లిప్‌ తగిలింది. ఆ అబ్బాయి కానీ, అతని బంధువు కానీ అది గమనించలేదు. తన వద్దకు వచ్చిన ఆ స్లిప్‌ పేపర్‌ కూడా తెరవని యువతి.. ప్రేమ లేఖగా పొరబడింది. ఆమె అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పుడు బాలుడి ప్రాణం పోయింది.

ఇవి కూడా చదవండి

బాలిక తల్లిదండ్రులు బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసి రైలు పట్టాల దగ్గర పడేశారు. 4 రోజుల తర్వాత అతని మృతదేహం గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. చేయని తప్పుకు ఆ అబ్బాయి ప్రాణాలు పోగొట్టుకుంటే.. చెల్లి చేసిన తప్పుకు ఆమె అన్న, నాన్న జైలుకు వెళ్లారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్