AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుడు కావాలంటూ అమ్మాయి ప్రకటన.. ఆమె డిమాండ్లు తెలిసి కళ్లు తేలేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఎలాంటి వాడు కావాలి..?

కాబోయే వాడికి ఉండాల్సిన అర్హతల గురుంచి అన్ని వివరించింది. వయసు, జీతం ఎంతుండాలి, విద్యార్హతలు ఎలా ఉండాలనే విషయాలను ఓ రెజ్యూమ్‌లా తయారు చేసి పెట్టింది. కాకుంటే.. ఈ ప్రకటన చూసిన వారందరూ కళ్లు తేలేస్తున్నారు.

వరుడు కావాలంటూ అమ్మాయి ప్రకటన.. ఆమె డిమాండ్లు తెలిసి కళ్లు తేలేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఎలాంటి వాడు కావాలి..?
Marriage
Jyothi Gadda
|

Updated on: Oct 19, 2022 | 9:38 PM

Share

Viral Post: మా అబ్బాయికి వధువు కావలెను/ మా అమ్మాయికి వరుడు కావలెను.. ఇలాంటి ప్రకటనలు పత్రికలు, టీవీల్లోనూ చూస్తుంటాం.. ఇకపోతే, వరుడి విషయంలో అమ్మాయిల కోరికలు మాత్రం తగ్గడం లేదు. తమకు కాబోయే జీవిత బాగస్వామి ఎంపికలో వాళ్లు ఫుల్‌ క్లారిటీగా ఉంటున్నారు. తమకెలాంటి వరుడు కావాలో ముందే డిసైడ్ అయిపోతున్నారు. అలా ఓ అమ్మాయి ఓ మ్యాట్రీమోనల్ సైట్‌ లో తనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న వరుడు గురించి రాసుకొచ్చింది. కాబోయే వాడికి ఉండాల్సిన అర్హతల గురుంచి అన్ని వివరించింది. వయసు, జీతం ఎంతుండాలి, విద్యార్హతలు ఎలా ఉండాలనే విషయాలను ఓ రెజ్యూమ్‌లా తయారు చేసి పెట్టింది. కాకుంటే.. ఈ ప్రకటన చూసిన వారందరూ కళ్లు తేలేస్తున్నారు. అంతే అది కాస్తా వైరల్ అయిపోయింది. ఈ జన్మలో అలాంటి అబ్బాయిని పొందలేవంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

వధువుకు పెట్టిన భారీ డిమాండ్ల చిట్టాకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఇది సాధారణమైనది కాదు. అమ్మాయి తన డిమాండ్‌ను ఖచ్చితంగా CV లాగా చేసింది. వరుడు జూన్, 1992 కంటే ముందు జన్మించి ఉండకూడదని చెప్పింది. అబ్బాయి ఇల్లు ఢిల్లీ-NCR లో ఉండాలి..అతని ఎత్తు 5 అడుగుల 7 అంగుళాల నుండి 6 అడుగుల వరకు ఉండాలి. ఇంట్లో ఇద్దరు తోబుట్టువులు కంటే ఎక్కువ ఉండకూడదు. కుటుంబం చదువుకోవాలి.(సర్వీస్ లేదా బిజినెస్ క్లాస్) దీనితో పాటు, అబ్బాయి తప్పనిసరిగా MBA, MTech, MS, PGDM డిగ్రీని కలిగి ఉండాలి, అది కూడా IIT, NIT వంటి సంస్థలలో ఉండాలి. IIM నుండి. అబ్బాయి కార్పొరేట్ రంగంలో పని చేయాలి.. అతని జీతం సంవత్సరానికి 30 లక్షల కంటే తక్కువ ఉండకూడదు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో @RetardedHurt అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. వార్తలు రాసే సమయానికి 250కి పైగా లైక్‌లు, కామెంట్‌లు వస్తున్నాయి. ఇవండీ.. ఈ వధువు గారి డిమాండ్లు. ఈ యువతి డిమాండ్లను చూసి నెటిజన్లు ఈమెకు పెళ్లవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వధువు పెళ్లి ప్రకటన మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి