స్మార్ట్‌ఫోన్‌ కొనడానికి తన రక్తాన్ని అమ్మకానికి పెట్టిన 16ఏళ్ల అమ్మాయి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఉదయం 10 గంటలకు ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. జిల్లా ఆసుపత్రికి చెందిన బ్లడ్ బ్యాంక్ కావడంతో రక్తం తీసుకునేందుకు వచ్చిందని మొదట్లో అనుకున్నాం. కానీ ఆమె మాకు రక్తాన్ని అమ్మాలనుకుంటున్నట్లు చెప్పినప్పుడు..

స్మార్ట్‌ఫోన్‌ కొనడానికి తన రక్తాన్ని అమ్మకానికి పెట్టిన 16ఏళ్ల అమ్మాయి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Smart Phones
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 19, 2022 | 9:55 PM

ఒక నిరుపేద కుటుంబానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్మార్‌ ఫోన్‌ కొనడం కోసం తన రక్తాన్ని అమ్మేందుకు ప్రయత్నించింది. ఈ షాకింగ్‌ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని దినజ్‌పూర్‌ జిల్లాలో జరిగింది. స్మార్ట్‌ఫోన్ కొనడానికి తన రక్తాన్ని విక్రయించడానికి సోమవారం జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్‌ను సంప్రదించింది. దినజ్‌పూర్‌ జిల్లాలోని తపన్ పోలీస్ స్టేషన్ పరిధి కర్దా ప్రాంతంలో నివసిస్తున్న 16 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతున్నది. స్మార్ట్‌ ఫోన్‌ కొనాలని భావించిన ఆమె రూ.9,000 విలువైన మొబైల్‌ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసింది. అయితే ఆ మొబైల్‌ అందేలోపు అంత డబ్బు ఏర్పాటు చేసుకోవడం కష్టంగా భావించింది. దీంతో తన రక్తాన్ని అమ్మి డబ్బులు సమకూర్చుకునేందుకు ఆ బాలిక ప్రయత్నించింది.

బ్లడ్‌ విక్రయించేందుకు గానూ ఆ బాలిక బాలూర్‌ఘట్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ బ్లండ్‌ బ్యాంకులో విధులు నిర్వహించే ఉద్యోగిని కలిసింది. డబ్బులు ఇస్తే రక్తం ఇస్తానని చెప్పింది. దీంతో ఆందోళన చెందిన బ్లడ్ బ్యాంక్ అధికారులు చైల్డ్‌లైన్ ఇండియాకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన చైల్డ్‌ కేర్‌ సంస్థ సిబ్బంది, రక్తం ఎందుకు అమ్మాలనుకుంటోందో అని ఆ బాలికను అడిగారు. స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు కోసమని ఆమె చెప్పడం విని షాకయ్యారు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో బాలికను తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ చేశారు. ఈ మేరకు బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు…

ఉదయం 10 గంటలకు ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. జిల్లా ఆసుపత్రికి చెందిన బ్లడ్ బ్యాంక్ కావడంతో రక్తం తీసుకునేందుకు వచ్చిందని మొదట్లో అనుకున్నాం. కానీ ఆమె మాకు రక్తాన్ని అమ్మాలనుకుంటున్నట్లు చెప్పినప్పుడు మేమంతా షాక్ అయ్యాము..అని బాలూర్‌ఘాట్ జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ నుండి కనక్ కుమార్ దాస్ అన్నారు.

ఇవి కూడా చదవండి

సోమవారం ట్యూషన్‌కు హాజరవుతానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె సైకిల్‌ను బస్టాండ్‌లో వదిలేసింది. ఆమె 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలూర్‌ఘాట్‌లోని జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి తపన్ నుండి బస్సు ఎక్కి నేరుగా ఆసుపత్రికి వెళ్లింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు
యూఏఎన్ నంబర్ యాక్టివేషన్ చేశారా..? జనవరి 15 వరకే అవకాశం
యూఏఎన్ నంబర్ యాక్టివేషన్ చేశారా..? జనవరి 15 వరకే అవకాశం
వినోద్ కాంబ్లీకి జీవితాంతం ఉచిత చికిత్స..
వినోద్ కాంబ్లీకి జీవితాంతం ఉచిత చికిత్స..
ఈ చిట్కాలతో ఉల్లిపాయలను ఎక్కువు రోజులు నిల్వ ఉంటాయి..
ఈ చిట్కాలతో ఉల్లిపాయలను ఎక్కువు రోజులు నిల్వ ఉంటాయి..
1.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన జియో
1.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన జియో
ఉండేదేమో గుడిసెలో.. కానీ రూ.40 వేలతో సీసీ కెమెరాలు పెట్టించాడు
ఉండేదేమో గుడిసెలో.. కానీ రూ.40 వేలతో సీసీ కెమెరాలు పెట్టించాడు
12 మందితో ఎఫైర్స్.. పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు.. ఈ స్టార్ హీరోయిన్
12 మందితో ఎఫైర్స్.. పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు.. ఈ స్టార్ హీరోయిన్
బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే..
బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే..
ఈ ఆఫర్ ను అసలు వదులుకోకండి.. అత్యంత తక్కువ ధరకే టీవీఎస్ ఐక్యూబ్.!
ఈ ఆఫర్ ను అసలు వదులుకోకండి.. అత్యంత తక్కువ ధరకే టీవీఎస్ ఐక్యూబ్.!
యువతలో ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్.. అశ్రద్ధ చేస్తే కష్టమే!
యువతలో ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్.. అశ్రద్ధ చేస్తే కష్టమే!