Aryan Khan case: ఆర్యన్​ఖాన్‌ను కావాలనే టార్గెట్ చేశారు.. ఎన్‌సీబీ రిపోర్ట్‌లో సంచలన నిజాలు

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్​ఖాన్‌ను కావాలనే టార్గెట్​చేశారంటుంది NCB..కేసు విచారణలో లొసుగులు ఉన్నాయంటుంది..కేసులో ఉన్న లొసుగులేంటి? NCB రిపోర్ట్‌లో ఉన్న నిజాలేంటి.?

Aryan Khan case: ఆర్యన్​ఖాన్‌ను కావాలనే టార్గెట్ చేశారు.. ఎన్‌సీబీ రిపోర్ట్‌లో సంచలన నిజాలు
Aryan Khan
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 19, 2022 | 9:39 PM

గత ఏడాది అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది..క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విజిలెన్స్ విభాగం నివేదిక వెల్లడించింది.కేసు దర్యాప్తులో అనేక అక్రమాలను గుర్తించడమే కాకుండా.. సుమారు ఎనిమిది మంది అధికారుల ప్రవర్తన అనుమానంగా ఉందని గుర్తించింది.ఆర్యన్ ఖాన్‌ను ఉద్దేశపూర్వకంగా ఇరికించినందున..ఆ కేసును సరైన రీతిలో దర్యాప్తు చేయలేదని, అయితే ఇదంతా ఎందుకు చేశారో తెలియాల్సి ఉందని ఆ నివేదిక వెల్లడించింది.

ఎన్సీబీ ముంబై యూనిట్‌లో విధులు నిర్వహించిన అప్పటి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే సహా ఇతర అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది.ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్‌తో పాటు, 8 మంది అధికారులపై 3వేల పేజీల ఛార్జిషీట్‌ను NCB అధికారులు సిద్ధం చేశారు.. ముంబై తీరంలోని ఓ క్రూజ్‌ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం..అదే నౌకలో ఆర్యన్‌ ఖాన్‌ ఉండడంతో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు.

28 రోజుల పాటు జైల్లో ఉన్న అతడు..అక్టోబరు 30న బెయిల్‌పై విడుదలయ్యాడు.కోర్టు ఆదేశాల మేరకు ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. అయితే, ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో..ఈ కేసులో ఎన్సీబీ అతడికి ఇటీవల క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.. అయితే ఈ వ్యవహారం తెరపైకి రావడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు ఆర్యన్‌ ఖాన్.

మరిన్ని జాతీయ వార్తల కోసం