AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బస్టాండ్‌ టాయిలెట్‌లోంచి పసికందు ఏడుపు శబ్ధాలు.. ఏం జరిగిందని ఆరా తీయగా షాకింగ్‌ సీన్‌

మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బీహార్‌కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు టాయిలెట్‌కు వెళ్లినట్లు అంబాలా కాంట్ బస్టాండ్ ఇన్‌ఛార్జ్ రాజేష్ కుమార్ తెలిపారు.

బస్టాండ్‌ టాయిలెట్‌లోంచి పసికందు ఏడుపు శబ్ధాలు.. ఏం జరిగిందని ఆరా తీయగా షాకింగ్‌ సీన్‌
New Born Baby
Jyothi Gadda
|

Updated on: Oct 19, 2022 | 8:22 PM

Share

అమ్మనాన్న అనిపించుకోవాలని తపన, పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఎంతో మంది దంపతులు ఆవేదన పడుతుంటారు. ఇదే సమయంలో మాతృత్వాన్ని మరచిపోయి అప్పుడే పుట్టిన పసికందుల్ని నిర్దాక్షీణ్యంగా వదిలి వెళ్తుంటారు కొందరు తల్లులు..ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉంటాయి. తాజాగా హర్యానా రాష్ట్రంలో ఇటువంటిదే అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్నతల్లి రోజుల పసికందును అనాధను చేసింది. హర్యానా రాష్ట్రంలోని అంబాలా కంటోన్మెంట్‌ బస్టాండ్‌లో నవజాత శిశువును విడిచివెళ్లింది ఆ తల్లి. నాలుగైదు రోజల వయసున్న మగబిడ్డను ఓ తల్లి బస్టాండులోని టాయిలెట్స్‌లో విడిచిపెట్టి వెళ్లింది.

టాయిలెట్‌లోకి వెళ్లిన ఓ ప్రయాణికురాలు పసికందును గమనించి బస్టాండ్లోని అధికారులకు సమాచారం ఇచ్చింది. అస్వస్థతకు గురై ఉన్న ఆ చిన్నారిని అధికారులు స్థానికంగా ఉన్న సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. పసికందును పరిశీలించిన వైద్యులు ఆ చిన్నారి పుట్టుకామెర్లతో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు.

కాగా, ఘటనపై బస్టాండ్‌ అధికారులు స్థానిక లాల్ కుర్తీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా బస్టాండ్లో పసికందును వదిలి వెళ్లిన వ్యక్తిని గుర్తించే పనిలోపడ్డారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బీహార్‌కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు టాయిలెట్‌కు వెళ్లినట్లు అంబాలా కాంట్ బస్టాండ్ ఇన్‌ఛార్జ్ రాజేష్ కుమార్ తెలిపారు. టవల్‌లో చుట్టి ఉన్న శిశువును చూసి అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి