కుందేలు నదిలో ఈత కొట్టడం ఎప్పుడైనా చూసారా? వీడియో చూసి నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు..
అది ఏం ఆలోచించకుండా లోతైన నీటిలోకి దూకేసింది. అయ్యో పాపం.. ఆ చిన్న జీవి మునిగిపోతుందని అంతా అనుకున్నారు..మీరు కూడా అలాగే అనుకుంటూ ఉండవచ్చు. కానీ,
కుందేళ్ళు దూకడం, పరిగెత్తడం చూసి ఉంటారు. కానీ, కుందేళ్ళు ఈత కొట్టడం మీరు ఎప్పుడైనా చూశారా? కుందేళ్ల వంటి జంతువులు కూడా స్విమ్మింగ్ టాలెంట్ చూపగలవని చాలా మందికి తెలియదు. కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో కుందేలు వేగంగా ఈత కొట్టడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోకు 2.7 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే, జనాలు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
వైరల్ వీడియోలో మీరు నది ఒడ్డున కూర్చున్న కుందేలును చూడవచ్చు. కానీ, ఆ కుందేలు మనస్సులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. అది ఏం ఆలోచించకుండా లోతైన నీటిలోకి దూకేసింది. అయ్యో పాపం.. ఆ చిన్న జీవి మునిగిపోతుందని అంతా అనుకున్నారు..మీరు కూడా అలాగే అనుకుంటూ ఉండవచ్చు. కానీ, ఆ మరు క్షణం ఏం జరిగిందో చూస్తే.. మీరు ఆశ్చర్యపోతారు. ఈ కుందేలు గొప్ప స్విమ్మర్ అని తేలింది. వీడియోలో బిందాస్ ఈత కొడుతూ కనిపించింది కుందేలు.
Rabbits can swim.. pic.twitter.com/it0IqnkHxf
— Buitengebieden (@buitengebieden) October 17, 2022
కుందేలు ఈత కొడుతున్న వీడియోను బుటెంగేబిడెన్ అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది. వినియోగదారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, కుందేలు కూడా ఈత కొట్టగలదు అని శీర్షిక పెట్టారు. కేవలం 17 సెకన్ల ఈ క్లిప్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఒక రోజు క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 27 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి, అయితే లక్ష మందికి పైగా లైక్ చేసారు. ఈ వీడియోను చూసిన వందలాది మంది తమ స్పందనలను తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.