Humanity: ఈ యువకుడి ఉదారతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. చెత్తను సేకరించే వృద్ధురాలిని షాపింగ్ తీసుకెళ్లి..
ఓ ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో జనాల హృదయాలను హత్తుకుంది. ఈ వైరల్ క్లిప్‌లో చెత్త సేకరించే ఓ వృద్ధ మహిళకు యువకుడు సహాయం చేస్తున్న తీరు నెటిజన్లు ఫిదా చేస్తోంది.
ప్రపంచంలో మనుషులు రెండు రకాలు. కష్టాల్లో ఉన్న వారిని చూసి మంచి మనసుతో వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. మరికొందరు చూసిన తర్వాత కూడా వారిని పట్టించుకోని వారు. మనచుట్టూ ఎంతోమంది నిస్సహాయులను ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. కానీ వారి కోసం ఏమైనా సహయం చేశారా? అంటే సమాధానం చెప్పలేం. ఈ నేపథ్యంలో ఓ ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో జనాల హృదయాలను హత్తుకుంది.ఓ ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో జనాల హృదయాలను హత్తుకుంది. ఈ వైరల్ క్లిప్‌లో చెత్త సేకరించే ఓ వృద్ధ మహిళకు యువకుడు సహాయం చేస్తున్న తీరు నెటిజన్లు ఫిదా చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రారంభంలో 75 ఏళ్ల మహిళ చెత్త ఏరుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఏం చేస్తున్నారు ? అని ఆమెను అడిగితే ‘నేను చెత్త సేకరించి అమ్మడం ద్వారా కొంత డబ్బు సంపాదిస్తాను’ అని చెప్పింది. దీంతో ఆ యువకుడి హృదయం ద్రవించిపోయింది. ఆ తర్వాత ఆ యువకుడు ఆమెను తీసుకెళ్లి షాపింగ్ చేయించి ..కూరగాయాలు, వేయింగ్ మిషన్, తోపుడు బండి వంటి అన్ని వస్తువులు కొని కూరగాయాలు అమ్ముకుంటూ బతకమని చెబుతాడు. అంతేకాదు ఆమెకు రోజు బతకడానికి కావల్సిన కనీస అవసరాలన్నింటిని సమకూరుస్తాడు. దీంతో సదరు వృద్ధురాలి సంబరపడిపోతూ ఆ యువకుడిని ఆనందంగా ఆశీర్వదిస్తుంది
ఇందుకు సంబంధించిన వీడియోని ఐఏఎస్ ఆఫీసర్ అవినాశ్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వృద్ధురాలికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి తరుణ్ మిశ్రా అనే ఇన్‌స్ట్రాగ్రామర్ అని అందులో చెప్పుకొచ్చారు. అతను తన అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియో నచ్చడంతో ఇలా షేర్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. అలాగే వేలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. వృద్ధురాలికి సాయం చేసిన సదరు యువకుడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Humanity.??? pic.twitter.com/NUZTGEB6Cp
— Awanish Sharan (@AwanishSharan) October 18, 2022
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..