T20 World Cup: చూసుకోవాలి కదా భయ్యా.. బౌండరీ రోప్‌ తగిలి బొక్క బోర్లా పడ్డ క్రికెటర్‌

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఏదశలోనూ భారీస్కోరు చేసేలా కనిపించలేదు యూఏఈ.

T20 World Cup: చూసుకోవాలి కదా భయ్యా.. బౌండరీ రోప్‌ తగిలి బొక్క బోర్లా పడ్డ క్రికెటర్‌
T20 World Cup
Follow us
Basha Shek

|

Updated on: Oct 16, 2022 | 6:10 PM

క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచ కప్ సమరం ప్రారంభమైంది. తొలి రోజు జరిగిన రెండు మ్యాచ్‌లూ అభిమానులకు ఎంతో మజాను అందించాయి. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లోనే పెను సంచలనం నమోదైంది. పసికూన నమీబియా ఆసియా ఛాంపియన్‌ శ్రీలంకను భారీ తేడాతో ఓడించి షాకిచ్చింది. ఇక రెండో మ్యాచ్‌లో యూఏఈ, నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఏదశలోనూ భారీస్కోరు చేసేలా కనిపించలేదు యూఏఈ. ముహమ్మద్‌ వసీప్‌ (47 బంతుల్లో 41) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌ ద్వారా ప్రపంచకప్‌లో ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు యూఏఈ ప్లేయర్‌ ఆయన్ అఫ్జల్ ఖాన్. ఈ మ్యాచ్‌లో అతను 7 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే త్వరగా ఔటయ్యాడని నిరాశకు గురయ్యాడేమో ..ఔటై తిరిగి వెళ్తుండగా బౌండరీ రోప్‌ కాళ్లకు తగిలి బొక్క బొర్లాపడ్డాడు.

ఈ సమయంలో అతని పరిస్థితి చూసి కామెంటేటర్లు కూడా నవ్వుకున్నారు. అలాగే స్టేడియంలో ఉన్న కొంతమంది ప్రేక్షకులు కూడా తమ నవ్వు ఆపుకోలేకపోయారు. అయాన్ మాత్రం సమయం వృథా చేయకుండా వెంటనే లేచి నిలబడి పెవిలియన్ మెట్ల వైపు పరుగెత్తడం ప్రారంభించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది నెదర్లాండ్స్‌. 112 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి అందుకుంది నెదర్లాండ్స్‌. మ్యాక్స్‌ (23), కొలిన్‌ (17) రాణించారు. అంతుకుముందు నెదర్లాండ్స్‌ బౌలింగ్‌ ముందు యూఏఈ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.. బౌలర్లు యూఏఈ బ్యాట్స్‌మెన్‌పై పగ్గాలు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగుల స్వల్ప స్కోరు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..