T20 World Cup: కెప్టెన్స్ డే మీట్‌లో అరుదైన ఘటన.. 15 దేశాల కెప్టెన్ల సమక్షంలో బాబర్ బర్త్ డే సెలబ్రేషన్స్
కెప్టెన్స్ డే మీట్‌లో ఓ అరుదైన వేడుక జరిగింది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ తెచ్చిన కేక్‌ను బాబర్ కట్ చేశాడు.
ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచ కప్ 2022 సమరానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. కాగా టోర్నీకి ముందు మెల్‌బోర్న్‌లో విలేకరుల సమావేశం జరిగింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో సహా 16 జట్ల కెప్టెన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. టోర్నీలో తమ ఉద్దేశాలేంటో స్పష్టంగా తెలియజేశారు. కాగా కెప్టెన్స్ డే మీట్‌లో ఓ అరుదైన వేడుక జరిగింది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ ఫించ్ తెచ్చిన కేక్‌ను బాబర్ కట్ చేశాడు. టోర్నీలో పాల్గొంటున్న మరో 15 మంది జట్ల కెప్టెన్లతో బాబర్ తన పుట్టినరోజును జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా అన్ని జట్ల కెప్టెన్లు బాబర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బుమ్రా తప్పుకోవడంపై..
బాబర్ పుట్టినరోజు వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పార్టీలో రోహిత్ శర్మ ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ కనిపించాడు. ఈ సందర్భంగా బాబర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ బర్త్ డే విషెస్ తెలిపాడు హిట్ మ్యాన్. అంతకుముందు, విలేకరుల సమావేశంలో, కెప్టెన్లందరూ తమ తమ జట్ల ఉద్దేశాలను వ్యక్తం చేశారు. షాహీన్ అఫ్రిది పునరాగమనంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం హర్షం వ్యక్తం చేస్తే.. బుమ్రా తప్పుకున్నాడని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో మంచి బ్యాలెన్స్ ఉందని ఫించ్ చెప్పగా, అండర్ డాగ్స్ ముద్ర సరైనదని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.
Special guests for the birthday of ?? ©️! ??
We invited all the team captains at the @T20WorldCup to celebrate Babar Azam’s birthday ?? pic.twitter.com/WZFzYXywsO
— Pakistan Cricket (@TheRealPCB) October 15, 2022
కాగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు రేపటి నుంచే ప్రారంభమవుతున్నప్పటికీ, కీలకమైన సూపర్12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి ప్రారంభంకానున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆసీస్, కివీస్ తలపడనున్నాయి. ఇక అక్టోబర్ 23న జరిగే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. ఇండియా, పాక్ హోరాహోరీగా తలపడనున్నాయి.
Happy birthday @babarazam258 ?
That cake looks good! ?#T20WorldCup pic.twitter.com/JFNeBLoVg5
— ICC (@ICC) October 15, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..