INDW vs SLW: ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. టీమిండియా నయా ‘గోస్వామి’.. దెబ్బకు లంక ఢమాల్.. టార్గెట్ ఎంతంటే?

భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. దీంతో భారత్‌ ముందు 66 పరుగుల టార్గెట్ ఉంది.

INDW vs SLW: ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. టీమిండియా నయా 'గోస్వామి'.. దెబ్బకు లంక ఢమాల్.. టార్గెట్ ఎంతంటే?
India Women Vs Sri Lanka Wo
Follow us

|

Updated on: Oct 15, 2022 | 2:48 PM

శనివారం సిల్హెట్‌లో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఖరి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. రాధా యాదవ్‌కు బదులుగా హేమలతకు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంంది. కాగా శ్రీలంక జట్టులో ఎలాంటి మార్పు లేదు. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

అయితే, ఈ మ్యాచ్‌లో భాతర బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా రేణుకా సింగ్ తన బౌలింగ్‌తో లంకను దారుణంగా దెబ్బ తీసింది. ఆమె తన మొత్తం 3 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఇందులో 1 ఓవర్ మెయిడీన్ కావడం విశేసం. ఆ తర్వాత రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు, స్నేహా రాణా 2 వికెట్లు పడగొట్టింది. ఆది నుంచి శ్రీలంక ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా భారత బౌలర్లు ధీటుగా రాణించారు. లంక టీంలో కేవలం ఇద్దరు మాత్రమే రెండెంకల స్కోర్ దాటారు. మిగతా బ్యాటర్ల అంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఓ దశలో 5 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. కనీసం 10 ఓవర్లైనా ఆడుతుందా అనిపించింది. కానీ, ఆ తర్వాత బ్యాటర్లు పరుగుల కోసం కాకుండా క్రీజులో నిలదొక్కుకునేందుకు బ్యాటింగ్ చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేయగలిగింది.

ఈ మ్యాచ్ టీమిండియా గెలిస్తే 7వ టైటిల్ సొంతం చేసుకుంటుంది. తద్వారా భారత్‌కు 7వ టైటిల్ అవనుంది. ఇరు జట్లు 5వ సారి ఫైనల్‌లో తలపడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని ఫైనల్స్‌లోనూ భారత్‌ విజయం సాధించింది. టోర్నీలో 8 సార్లు ఫైనల్స్‌కు చేరిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. అలాగే భారత్ అత్యధికంగా ఆరుసార్లు ట్రోఫీని గెలిచింది.

14 ఏళ్ల తర్వాత..

శ్రీలంక 14 ఏళ్ల తర్వాత ఫైనల్ ఆడుతోంది. అంతకుముందు 2008లో ఆ జట్టు ఫైనల్ చేరింది. అయితే భారత్‌ నుంచి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఇరు జట్లు:

భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), దీప్తి శర్మ, రిచా ఘోష్ (w), పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్

శ్రీలంక మహిళలు (ప్లేయింగ్ XI): చమరి అతపత్తు(సి), అనుష్క సంజీవని(w), హర్షిత మాదవి, హాసిని పెరీరా, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, మల్షా షెహాని, ఓషాది రణసింగ్, సుగండిక కుమారి, ఇనోకా రణవీర, అచ్చిని కులసూర్య