AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Men’s T20 World Cup: పొట్టి సమరానికి ఇంకా ఒక్క రోజే సమయం.. భారత్ తలపడేది ఈ తేదీల్లోనే..

ఐసీసీ పురుషుల టీ - 20 ప్రపంచ కప్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. కప్పు కొట్టాలనే లక్ష్యంతో పలు దేశాలు పోటీలోకి దిగుతున్నాయి. అభిమానులను దాదాపు నెలరోజుల పాటు అలరించనున్నాయి. అయితే..

ICC Men's T20 World Cup: పొట్టి సమరానికి ఇంకా ఒక్క రోజే సమయం.. భారత్ తలపడేది ఈ తేదీల్లోనే..
T 20 World Cup
Ganesh Mudavath
|

Updated on: Oct 15, 2022 | 6:19 AM

Share

ఐసీసీ పురుషుల టీ – 20 ప్రపంచ కప్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. కప్పు కొట్టాలనే లక్ష్యంతో పలు దేశాలు పోటీలోకి దిగుతున్నాయి. అభిమానులను దాదాపు నెలరోజుల పాటు అలరించనున్నాయి. అయితే ఈ పోటీ గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు 16 జట్లు 45 మ్యాచ్‌లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్ A, B నుంచి మొదటి రెండు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ఆరు గ్రూపులతో కూడిన రెండు గ్రూపులు రౌండ్-రాబిన్‌లో ఆడతాయి. మొదటి రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. టోర్నీలో గెలుపొందిన జట్టుకు 1.6 మిలియన్లు యూఎస్ డాలర్లను నగదు బహుమతిగా అందిస్తారు. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు లభిస్తాయి. ఓడిన సెమీ-ఫైనలిస్ట్‌లు 4 లక్షల డాలర్లు అందిస్తారు. T20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలోని ఏడు నగరాల్లో జరుగుతుంది. 2007లో ఎమ్మెస్ ధోని నేతృత్వంలోని యువ భారత జట్టు ఆఖరి ఓవర్‌లో పాకిస్తాన్ ను ఓడించి, ఘన విజయం సాధించింది. ఈ ఏడాది టోర్నీ మూడు దశల్లో జరగనుంది. టోర్నమెంట్ మొదటి రౌండ్ క్వాలిఫైయర్లుగా ఉంటుంది. అందులో నుంచి నాలుగు జట్లు అంటే రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి.

మొదటి రౌండ్ గ్రూప్ A: నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ B: ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే సూపర్ 12 స్టేజ్ గ్రూప్ A, గ్రూప్ B నుంచి మొదటి రెండు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ఆరు గ్రూపులతో కూడిన రెండు గ్రూపులు రౌండ్-రాబిన్ ఆడతాయి. మొదటి రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. నాకౌట్ దశలో రెండు సెమీ-ఫైనల్‌లు, నవంబర్ 13న ఫైనల్ ఉంటుంది. గ్రూప్ 1 లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, గ్రూప్ A విజేత, గ్రూప్ B రన్నరప్, గ్రూప్ 2 లో బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, గ్రూప్ బి విజేత, గ్రూప్ ఎ రన్నరప్ ఉంటాయి. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్ బోర్న్ అడిలైడ్ ఓవల్, అడిలైడ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ గబ్బా, బ్రిస్బేన్ కార్డినియా పార్క్, గీలాంగ్ బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ పెర్త్ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

నవంబర్ 13 న ఫైనల్ టోర్నీ ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. నాకౌట్ దశల్లో సెమీ-ఫైనల్, ఫైనల్ రెండింటికీ రిజర్వ్ రోజులు ఉంటాయి. ఏ ఇతర మ్యాచ్‌లకూ రిజర్వ్ రోజులు లేవు. భారత్ vs ఆస్ట్రేలియా – 17 అక్టోబర్, భారత్ vs న్యూజిలాండ్ – 19 అక్టోబర్, భారత్ vs పాకిస్థాన్ – 23 అక్టోబర్, భారత్ vs రన్నరప్ (గ్రూప్ A) -27 అక్టోబర్, భారత్ vs దక్షిణాఫ్రికా – 30 అక్టోబర్, భారత్ vs బంగ్లాదేశ్- 2వ నవంబర్, అడిలైడ్ భారత్ vs విజేత (గ్రూప్ B) – 6 నవంబర్ న జరగుతాయి. స్టార్ నెట్‌వర్క్, స్కై స్పోర్ట్స్, ఫాక్స్ స్పోర్ట్స్, ESPN, PTV, టైమ్స్ ఇంటర్నెట్‌తో ప్రధాన ప్రసారకర్తలతో ఖండాంతరాలలో టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. భారతదేశం, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులలో స్టార్ నెట్‌వర్క్ టెలివిజన్ హక్కులను కలిగి ఉంది. హాట్‌స్టార్ డిస్నీ+ భారతదేశంలో గేమ్‌లను ప్రసారం చేస్తాయి.