Yuzvendra Chahal: కర్వాచౌత్‌ను వెరైటీగా సెలబ్రేట్‌ చేసుకున్న రొమాంటిక్‌ కపుల్‌.. వీడియో కాల్‌లో..

బాలీవుడ్‌ సెలబ్రిటీలందరూ కర్వాచౌత్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ భర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.

Yuzvendra Chahal: కర్వాచౌత్‌ను వెరైటీగా సెలబ్రేట్‌ చేసుకున్న రొమాంటిక్‌ కపుల్‌.. వీడియో కాల్‌లో..
Chahal,dhanashree Verma
Follow us

|

Updated on: Oct 14, 2022 | 8:41 PM

కర్వాచౌత్‌.. దీపావళికి వారం ముందు వచ్చే ఈ పండగను ఇండియాలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పర్వదినానా మహిళలు తమ జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ ఉదయం నుంచి ఉపవాసం పాటిస్తారు. ఆరోజంతా అమ్మవారి సేవలోనే తరిస్తారు. ఇక సాయంత్రం చంద్రుడి దర్శనం అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి గ్రాండ్‌గా పండగను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈనేపథ్యంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలందరూ కర్వాచౌత్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ భర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ వినూత్నంగా కర్వాచౌత్‌ను సెలబ్రేట్‌ చేసుకుంది.

కాగా ఆస్ట్రేలియా వేదికగా త్వరలో టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు చాహల్‌. అయితే భర్త వెంటే ఉంటూ క్రికెట్‌ మ్యాచ్‌ల్ని వీక్షించే ధనశ్రీ ఈసారి ఆసీస్‌ వెళ్లలేదు. ఇంకా ఇండియాలోనే ఉంది. దీంతో ఈ జంట కర్వాచౌత్‌ వేడుకల్ని వీడియో కాల్‌ ద్వారా వినూత్నంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కపుల్స్‌ గోల్‌, సో క్యూట్‌ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా 2020 డిసెంబర్‌లో యూట్యూబర్‌, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీని వివాహమాడారు. ఈ మధ్యన విడాకులు తీసుకుంటారని వార్తలు వచ్చినా అవి వదంతులుగానే మిగిలిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ