AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhatat Jodo Yatra: తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌ ఖరారు.. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ.. పూర్తి వివరాలివే

తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర సాగేలా పాదయాత్ర రూట్ మ్యాప్‌ను డిజైన్ చేశారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణానది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు.

Bhatat Jodo Yatra: తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌ ఖరారు.. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ.. పూర్తి వివరాలివే
Rahul Gandhi
Follow us
Basha Shek

|

Updated on: Oct 13, 2022 | 9:22 PM

తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తోన్న ఆయన ఈ నెల 23న తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర సాగేలా పాదయాత్ర రూట్ మ్యాప్‌ను డిజైన్ చేశారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణానది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మీదుగా మద్నూర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. రూట్‌ మ్యాప్‌ ప్రకారం మక్తల్, దేవరకద్ర, మహాబూబ్ నగర్ టౌన్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్ పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మోజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయినపల్లి గాంధీ ఐడీయాలజీ సెంటర్, బాలానగర్, మూసాపేట్ జంక్షన్ , కూకట్‌పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, పటాన్ చెరువు, ఓటర్ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి రిజర్వు ఫారెస్ట్, జోగిపేట్, శంకరం పేట్, మద్దునూర్‌ల మీదగా ఈ పాదయాత్ర సాగనుంది.

గ్రాండ్ సక్సెస్‌ చేయాలి..

కాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాకూర్ రాహుల్ గాంధీ పాదయాత్ర వివరాలను వెల్లడించారు. ‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మనకు అత్యంత కీలకం. భారత్ జోడో యాత్ర గురించి పంచాయతీలలో వాల్ రైటింగ్స్ చేయించాలి. ప్రచారం, పోస్టర్లు గ్రామ గ్రామాన చేపట్టాలి. ప్రజలను ఐక్యం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి. ప్రతి రెండు కిలో మీటర్ల ఒక నాయకుడు బాధ్యత తీసుకుని కార్యక్రమం విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.

ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ’23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుంది. కర్ణాటక నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. యాత్రపై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించాం. ఈ నెల 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశిస్తుంది. హైదరాబాద్ లో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుంది. ఇందిరాగాంధీ వర్దంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభ నిర్వహిస్తాం. జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ వరకు జోడో యాత్ర కొనసాగుతుంది. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..