AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Bhagyashree: టాలీవుడ్‌లోకి భాగ్యశ్రీ గారాలపట్టి.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌.. హీరో ఎవరో తెలుసా?

పెళ్లి చేసుకుని ఇంటికే పరిమితమైన  భాగ్యశ్రీ చాలా ఏళ్ల తర్వాత రాధేశ్యామ్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అంతకుముందు కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన తలైవీలోనూ మెరిసింది.

Actress Bhagyashree: టాలీవుడ్‌లోకి భాగ్యశ్రీ గారాలపట్టి.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌.. హీరో ఎవరో తెలుసా?
Actress Bhagyashree
Basha Shek
|

Updated on: Oct 12, 2022 | 3:55 PM

Share

మైనే ప్యార్‌ కియా సినిమాతో బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది భాగ్యశ్రీ. తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. సినిమాలో ఆమె అందం, అభినయానికి అందరూ ముగ్ధులైపోయారు. అయితే వన్‌ ఫిల్మ్‌ వండర్‌లా ఆమె కేవలం ఒక్క సినిమాకే పరిమితమైంది. ఆతర్వాత బాలకృష్ణ నటించిన యువరత్న రాణాతో పాటు కొన్ని కన్నడ, తమిళ్‌, బెంగాలీ సినిమాల్లో నటించినా అవన్నీ పూర్తి స్థాయి పాత్రలు కాదు. పెళ్లి చేసుకుని ఇంటికే పరిమితమైన  భాగ్యశ్రీ చాలా ఏళ్ల తర్వాత రాధేశ్యామ్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అంతకుముందు కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన తలైవీలోనూ మెరిసింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ కుమారుడు, కూతురు కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఇప్పటికే కుమారుడు అభిమన్యు దుస్సాని బాలీవుడ్‌లో నటుడిగా పరిచయమ్యాడు. కుమార్తె అవంతిక దుస్సానీ కూడా మిత్యా వెబ్‌సిరీస్‌తో వెండితెరకు పరిచయమైంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకి కూడా ఎంటర్‌ అవుతోంది.

కాలేజీ స్టూడెంట్‌గా..

ఇటీవల స్వాతిముత్యంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ గణేశ్‌. అతని తర్వాతి చిత్రం నేను స్టూడెంట్ సార్‌. ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడైన రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్‌గా అవంతిక ఎంపికైంది. ఇందులో ఆమె శృతి వాసుదేవన్‌ అనే కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమెకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు మూవీ మేకర్స్‌. ఎంతో స్టైలిష్‌ అండ్‌ క్యూట్‌గా ఉన్న ఈ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కృష్ణ చైతన్య కథ అందిస్తున్నారు. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ బాణీలు సమకూరుస్తున్నారు. నిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జ‌రుపుకుంటోంది. త్వరలోనే విడుద‌ల తేదీని ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
SBI కస్టమర్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు..
SBI కస్టమర్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు..
KGBV విద్యాలయాల్లో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం 2026 ప్రవేశాలు.. లింక్
KGBV విద్యాలయాల్లో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం 2026 ప్రవేశాలు.. లింక్
వెంకటేశ్వర స్వామిగా ముందుగా ఆ హీరోని అనుకున్నారా.!
వెంకటేశ్వర స్వామిగా ముందుగా ఆ హీరోని అనుకున్నారా.!
క్రెడిట్‌ కార్డ్‌ ఇలా వాడితే CIBIL స్కోర్‌ పెరుగుతుందా?
క్రెడిట్‌ కార్డ్‌ ఇలా వాడితే CIBIL స్కోర్‌ పెరుగుతుందా?
నాగబాబు పేరును గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న కమెడియన్..
నాగబాబు పేరును గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న కమెడియన్..
ప్రతి రోజూ చికెన్ తింటుఈ 4 సమస్యలతో మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే
ప్రతి రోజూ చికెన్ తింటుఈ 4 సమస్యలతో మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే
అదృష్టమే, ఆనందమే.. పుష్కర యోగంతో ఈ రాశుల ఇంట సిరుల పంట!
అదృష్టమే, ఆనందమే.. పుష్కర యోగంతో ఈ రాశుల ఇంట సిరుల పంట!
ఈ ఐదుగురికి ఇదే చివరి సీజన్.. ఇకపై ఐపీఎల్‌లో ఆడడం కష్టమే..?
ఈ ఐదుగురికి ఇదే చివరి సీజన్.. ఇకపై ఐపీఎల్‌లో ఆడడం కష్టమే..?