David Warner: ఫిలింఫేర్‌ పురస్కారాల్లో పుష్ప క్లీన్‌ స్వీప్‌.. ఉత్తమ నటుడిగా బన్నీ.. డేవిడ్ భాయ్ రియాక్షన్‌ ఏంటంటే?

ఈ పురస్కారాల్లో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా హవా కొనసాగింది. ఏకంగా 7 అవార్డులు కైసవం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ విభాగాల్లో పుష్ప సత్తాచాటింది.

David Warner: ఫిలింఫేర్‌ పురస్కారాల్లో పుష్ప క్లీన్‌ స్వీప్‌.. ఉత్తమ నటుడిగా బన్నీ.. డేవిడ్ భాయ్ రియాక్షన్‌ ఏంటంటే?
David Warner
Follow us

|

Updated on: Oct 11, 2022 | 4:37 PM

కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా 67వ ఫిలింఫేర్‌ అవార్డులు అట్టహాసంగా జరిగాయి. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌..ఇలా వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులు ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, దివంగత కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌కు ఈ ఏడాది ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఇక ఈ పురస్కారాల్లో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా హవా కొనసాగింది. ఏకంగా 7 అవార్డులు కైసవం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ విభాగాల్లో పుష్ప సత్తాచాటింది. ఇదే సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అందుకున్నాడు బన్నీ. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. అల్లు అర్జున్‌, పుష్ప టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.తాజాగా దీనిపై ఆస్ట్రేలియా డ్యాషింగ్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు.

పుష్ప యూనిట్‌కు కంగ్రాట్స్‌..

ఫిలింఫేర్‌ పురస్కారాల్లో పుష్ప సినిమా క్లీన్‌ స్వీప్‌ చేయడం అభినందనీయమన్న వార్నర్‌.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం అని పేర్కొన్నాడు. పుష్ప సినిమా తనకు ఎంతగానో నచ్చిందన్నాడు. ఈ సందర్భంగా పుష్ప సినిమా యూనిట్‌ సభ్యులందరికీ అభినందనలు తెలిపిన వార్నర్‌.. గతంలో తాను పుష్ప గెటప్‌ లో అలరించిన మార్ఫింగ్‌ ఫొటోను ఫ్యా్న్స్‌తో పంచుకున్నాడు. కాగా గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన వార్నర్‌ పలువురు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలను అనుకరిస్తూ మార్ఫింగ్‌ వీడియోలు చేశాడు. ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమాలోని బన్నీ ఐకానిక్‌ స్టెప్పును సూపర్‌గా రీక్రియేట్‌ చేశాడు. తాజాగా ఇప్పుడు కూడా బన్నీకి విషెస్‌ చెప్పి అభిమానుల మనసు గెల్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా గత కొన్ని రోజులుగా ఫామ్‌లేమితో సతమతవుతోన్న వార్నర్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. కేవలం 44 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.ఈ ఇన్నింగ్స్‌తో ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ ముందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పొందుపరచుకున్నాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..