ఛీఛీ.. ఇది తొండాట.. స్టార్‌ బ్యాటర్‌పై మండిపడుతోన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌.. క్రీడాస్ఫూర్తి మరిచావంటూ కామెంట్లు

ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ని చీవాట్లు పెడుతోంది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు అతడిని ఛీటర్‌ అంటూ తిట్టపోస్తున్నారు.

ఛీఛీ.. ఇది తొండాట.. స్టార్‌ బ్యాటర్‌పై మండిపడుతోన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌.. క్రీడాస్ఫూర్తి మరిచావంటూ కామెంట్లు
Matthew Wade, Mark Wood
Follow us
Basha Shek

|

Updated on: Oct 10, 2022 | 6:01 AM

టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఆదివారం పెర్త్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠ రేపింది. విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. అయితే ఆఖరుకు ఇంగ్లండ్‌నే విజయం వరించింది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ని చీవాట్లు పెడుతోంది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు అతడిని ఛీటర్‌ అంటూ తిట్టపోస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఈ మ్యాచ్‌లో 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా విజయం కోసం తుది వరకు ప్రయత్నించింది. ఆజట్టు విజయానికి చివరి 4 ఓవర్లలో 40 పరుగులు అవసరం కాగా క్రీజులో వార్నర్‌, మాథ్యూ వేడ్‌ ఉన్నారు. ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ 17ఓవర్‌ బౌలింగ్‌కి వచ్చాడు. మొదటి బంతికి డేవిడ్ వార్నర్ సింగిల్ తీయగా రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి షాట్ ఆడబోయిన మాథ్యూ వేడ్, గాల్లోకి బంతి లేపాడు. అది అక్కడే ‌పైకి లేచింది. దీంతో మార్క్ వుడ్‌ బంతిని క్యాచ్‌ పట్టేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో మాథ్యూ వేడ్‌ అతన్ని పట్టుకుని గట్టిగా లాగుతూ ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. మార్క్ వుడ్‌తో పాటు ఇంగ్లండ్‌ క్రికెటర్లకు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు గాల్లోకి లేచిన బంతి కింద పడిపోయింది.

కంగారూలు క్రీడాస్ఫూర్తి మరిచారు..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌ ఫ్యాన్స్‌ వేడ్‌ను తిడుడూ కామెంట్లు పెడుతున్నారు. కంగారూలు మరోసారి తమ బుద్ధిని చాటుకున్నారు. వేడ్‌ తొండాట ఆడాడు. క్రీడా స్ఫూర్తి మర్చిపోయాడు. అతను ఛీటర్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్న ఫీల్డర్‌ని ఉద్దేశపూర్వకంగా ఆపితే సదరు బ్యాటర్‌ని ఔట్‌గా ప్రకటిస్తారు. అయితే ఇక్కడ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్ బట్లర్‌ అప్పీల్‌ చేయకపోవడంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను అలాగే కొనసాగించారు. మ్యాచ్‌ అనంతరం ఇదే విషయమై బట్లర్‌ను ప్రశ్నించగా.. త్వరలోనే ప్రపంచకప్‌ ఆడాల్సి ఉన్నందున ఈ విషయంపై రాద్ధాంతం చేయదల్చుకోలేదని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా వేడ్‌ ఛీటింగ్‌ చేసినా ఈ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది ఆసీస్‌. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అలెక్స్‌ హేల్స్‌ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ వీరోచితంగా పోరాడింది. డేవిడ్‌ వార్నర్‌ (73), మార్ష్‌ (36), స్టోయినిస్‌(35) చెలరేగారు. అయితే ఆఖర్లో మార్క్‌వుడ్‌ (3/34) చెలరేగాడు. కట్టుదిట్టంగా బంతులేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. దీంతోనిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసిన ఆసీస్‌ 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..