Mohammed Azharuddin: అజారుద్దీన్‎కు భారీ షాక్‌.. హెచ్సీఏపై మరో కేసు నమోదు..

Hyderabad Cricket Association: క్రిమినల్, ఐపీసీ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ ని హెచ్సీఏ మాజీ ప్రతినిధులు కోరారు.

Mohammed Azharuddin: అజారుద్దీన్‎కు భారీ షాక్‌.. హెచ్సీఏపై మరో కేసు నమోదు..
Hca
Follow us
Venkata Chari

|

Updated on: Oct 10, 2022 | 2:51 PM

గత సెప్టెంబర్ 26తో హెచ్సీఏ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గడువు ముగిసింది. అయినా ఆ పదవిలోనే కోనసాగుతున్నాడు. దీంతో మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారయణ్, హెచ్సీఏ మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీకి కంప్లైంట్ చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ, తప్పుడు డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి బీసీసీఐ, ఈసీని చీట్ చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎవరిని సంప్రదించకుండా తానే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారంటూ విమర్శలు గుప్పించారు. ఈనెల 18 న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరు అయ్యేందుకు తన పదవి సమయాన్ని పొడిగించుకున్నట్లు పేర్కొన్నారు. క్రిమినల్, ఐపీసీ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ ని కోరారు.

ఉప్పల్‌ మ్యాచ్ టికెట్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ లో పెట్టిన కాసేపటికే టికెట్లు అమ్ముడుపోయానని చూపించడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆఫ్ లైన్ లో టికెట్లు ఇస్తామని హెచ్‌సీఏ ప్రకటించడంతో వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు జింఖానా మైదానానికి చేరుకుని టికెట్లు దక్కించుకోవడానికి ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈనేపథ్యంలో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ, ఏర్పాట్లలో హెచ్‌సీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ పలు సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి.