IND vs SA: సెంచరీ కోల్పోయినా.. భారీ రికార్డ్ సృష్టించిన టీమిండియా యంగ్ ప్లేయర్.. రోహిత్-గంగూలీ వెనుకంజలోనే..
Ishan Kishan: రాంచీలో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ కిషన్ 84 బంతుల్లో 93 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 4 ఫోర్లు, 7 సిక్సర్లు వచ్చాయి.
రాంచీలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీని తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 278 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. కేవలం 46వ ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ఈ విజయంలో ఇషాన్ కిషన్ కూడా కీలక పాత్ర పోషించాడు.
ఇషాన్ కిషన్ కేవలం 84 బంతుల్లో 93 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 4 ఫోర్లు, 7 సిక్సర్లు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీని కోల్పోయినప్పటికీ, ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఇషాన్.. తన పేరిట ఒక భారీ రికార్డును సృష్టించాడు. రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ వంటి వెటరన్ బ్యాట్స్‌మెన్‌లను కూడా వెనక్కునెట్టాడు.
రాంచీలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఎడమచేతి వాటం తుఫాన్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ఏడు సిక్సర్లు బాదాడు. దీంతో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ రికార్డు జాబితాలో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీల తర్వాత ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ నిలిచాడు.
దక్షిణాఫ్రికాతో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్స్ వీరే..
యూసుఫ్ పఠాన్ – 8 సిక్సర్లు – సెంచూరియన్, 2011
ఇషాన్ కిషన్ – 7 సిక్సర్లు – రాంచీ, 2022
సౌరవ్ గంగూలీ – 6 సిక్సర్లు – నైరోబి, 2000
రోహిత్ శర్మ – 6 సిక్సర్లు – కాన్పూర్, 2015
మ్యాచ్ విషయానికి వస్తే..
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాంచీలో ఈ విజయంతో భారత్ 1-1తో సిరీస్‌ను సమం చేసింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహరాజ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఐడెన్ మార్క్రామ్ బ్యాట్ నుంచి అత్యధిక పరుగులు వచ్చాయి. 89 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అదే సమయంలో రీజా హెండ్రిక్స్ 76 బంతుల్లో 74 పరుగులు చేశాడు.
చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా తరపున డేవిడ్ మిల్లర్ మరోసారి రాణించి 35 పరుగులు చేశాడు. భారత్ తరపున మహ్మద్ సిరాజ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.
శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ల అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయాన్ని అందుకుంది. అయ్యర్ తన వన్డే కెరీర్‌లో రెండో సెంచరీ సాధించాడు. 111 బంతులు ఎదుర్కొని 113 పరుగులు చేశాడు. అదే సమయంలో, ఇషాన్ మ్యాచ్‌లో 93 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 7 సిక్సర్లు వచ్చాయి. వీరిద్దరి మధ్య 161 పరుగుల భాగస్వామ్యం ఉంది. సంజూ శాంసన్ కూడా 30 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు.