Watch Video: టీ20ల్లో పెను విధ్వంసం.. 22 సిక్సర్లు, 17 ఫోర్లతో డబుల్ సెంచరీ.. సునామీ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్ధులు ఢమాల్

డబుల్ సెంచరీతో చెలరేగిన ఓ బ్యాటర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో.. అతని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు..

Watch Video: టీ20ల్లో పెను విధ్వంసం.. 22 సిక్సర్లు, 17 ఫోర్లతో డబుల్ సెంచరీ.. సునామీ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్ధులు ఢమాల్
Rahkeem Cornwall
Follow us
Venkata Chari

|

Updated on: Oct 06, 2022 | 12:36 PM

టీ20 ప్రపంచకప్‌ను గెలవాలనే లక్ష్యంతో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. కానీ, ఆ జట్టులోని ఓ ఆటగాడు ప్రస్తుతం అమెరికాలో విధ్వంసం సృష్టించాడు. అక్కడి టీ20 లీగ్‌లో బౌలర్లను చితకబాది, బీభత్సం చేశాడు. బౌలర్లపై కనికరం చూపకుండా.. ఎడాపెడా బౌండరీలు కొట్టేస్తూ.. డబుల్ సెంచరీ చేసేశాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత వెస్టిండీస్ జట్టు కచ్చితంగా పశ్చాత్తాప పడడం ఖాయంగా కనిపిస్తోంది. USA T20 లీగ్‌లోని అట్లాంటా ఓపెన్‌లో రెచ్చిపోయి డబుల్ సెంచరీని సాధించిన బ్యాటర్ రహ్కీమ్ కార్న్‌వాల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

డబుల్ సెంచరీతో చెలరేగిన రహ్కిమ్ కార్న్‌వాల్ టీం నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది. దీంతో అట్లాంటా ఫైర్ మ్యాచ్‌లో 172 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. స్క్వేర్ డ్రైవ్ పాంథర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది.

ఇవి కూడా చదవండి

కేవలం 39 బౌండరీలతో 200 పరుగులు..

రహ్కీమ్ కార్న్‌వాల్ తన ఇన్నింగ్స్‌లో 77 బంతులు ఎదుర్కొని 205 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 266.23గా నిలిచింది. అతని బ్యాట్ నుంచి 22 సిక్సర్లు, 17 ఫోర్లు వచ్చాయి. అంటే మొత్తం 39 బౌండరీలు బాదేశాడు. అంటే, తన 205 పరుగులలో రహ్కిమ్ కార్న్‌వాల్ కేవలం 39 బంతుల్లో 200 పరుగులు చేశాడు.

అద్భుత ఇన్నింగ్స్ వీడియో ఇక్కడ చూడండి..

వెస్టిండీస్ గుర్తించేనా..

టీ20లో రహ్కీమ్ చేసిన తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఒక్కాసారిగా నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకు ముందు కూడా అతను తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, దాని స్థాయి భిన్నంగా ఉంది. టీ20 క్రికెట్‌లో ఎన్నో బలమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, వెస్టిండీస్‌ తరపున టీ20 ఆడే అవకాశం అతనికి రాలేదు. అతను వన్డేలు కూడా ఆడలేదు. ఇప్పటి వరకు వెస్టిండీస్‌ తరపున టెస్టు క్రికెట్‌ మాత్రమే ఆడేవాడు.

దంచి కొట్టిన వెస్టిండీస్ ప్లేయర్..

రహ్కీమ్ కార్న్‌వాల్ ప్రస్తుతం అమెరికా గడ్డపై రికార్డులు నెలకొల్పుతుంటే.. వెస్టిండీస్ జట్టు మాత్రం ఆయనపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తోంది. ఈసారి టీ20 జట్టును సెలక్ట్ చేసేప్పుడు ఈయన పేరును ఖచ్చితంగా పరిశీలించాలని కోరుకుంటున్నారు.