Team India: భారీ విజయంతో సరికొత్త రికార్డ్ సృష్టించిన టీమిండియా.. అగ్రస్థానంలో సెమీఫైనల్ చేరిన మంధాన సేన..

India Women vs Thailand Women: మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. టీ20 క్రికెట్‌లో ఓ జట్టుపై అతిపెద్ద విజయం సాధించింది.

Team India: భారీ విజయంతో సరికొత్త రికార్డ్ సృష్టించిన టీమిండియా.. అగ్రస్థానంలో సెమీఫైనల్ చేరిన మంధాన సేన..
Womens Asia Cup T20 2022 India Women Vs Thailand Women
Follow us
Venkata Chari

|

Updated on: Oct 10, 2022 | 4:15 PM

భారత జట్టు అద్భుతం చేసింది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ సోమవారం అతిపెద్ద విజయాన్ని సాధించింది. మహిళల ఆసియా కప్ 2022 లో టీమిండియా మహిళలు చరిత్ర సృష్టించారు. స్మృతి మంధాన సారథ్యంలో భారత జట్టు 20 ఓవర్ల లక్ష్యాన్ని కేవలం 6 ఓవర్లలోనే సాధించింది. భారత్ కేవలం 84 బంతుల్లో విజయం సాధించింది. ఇది మాత్రమే కాదు, భారత మహిళల జట్టు మొదటిసారిగా 10 ఓవర్లలోపు విజయాన్ని నమోదు చేయడం విశేషం.

మహిళల ఆసియా కప్ 19వ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతాలు చేసి థాయ్‌లాండ్ జట్టును కేవలం 37 పరుగులకే పరిమితం చేశారు. స్నేహ రాణా 9 పరుగులిచ్చి 3 వికెట్లు, రాజేశ్వరి గైక్వాడ్ 8 పరుగులిచ్చి 2 వికెట్లు, దీప్తి శర్మ 10 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. కాగా, మేఘనా సింగ్‌కు విజయాన్ని అందుకుంది.

6 ఓవర్లలోనే విజయం..

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఒక వికెట్ నష్టానికి 40 పరుగులు చేసి విజయం సాధించింది. భారత్ విజయాన్ని నమోదు చేసేందుకు కేవలం 6 ఓవర్లు తీసుకుంది. మేఘన 20, పూజా వస్త్రాకర్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో భారత జట్టు సునాయాసంగా సెమీఫైనల్‌కు చేరుకుంది.

అగ్రస్థానంలో భారత్..

ఇప్పటికే సెమీఫైనల్‌లోకి ప్రవేశించిన భారత జట్టు.. ప్రస్తుతం రన్ రేట్ మరింత పటిష్టంగా మారడంతో 6 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కు 10 పాయింట్లు, పాకిస్థాన్ 5 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో ఉన్నాయి. అయితే పాకిస్థాన్‌కు ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది.

రికార్డులు సృష్టించిన టీమిండియా..

బాల్స్ పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2019లో వెస్టిండీస్‌పై భారత్ 57 బంతుల్లో విజయం సాధించింది. థాయ్‌లాండ్‌ కూడా తన పేరిట ఓ చెత్త రికార్డును లిఖించుకుంది. మొత్తం 10 వికెట్లు కోల్పోయిన తర్వాత ఆసియా కప్ టీ20 చరిత్రలో ఇది నాలుగో అత్యల్ప స్కోరు. 2018లో భారత్‌పైనే 27 పరుగులకు కుప్పకూలింది.