AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Western Australia: అదరగొట్టిన రోహిత్ సేన.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సూర్య.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ విధ్వంసం..

టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేయగా, అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నారు.

India vs Western Australia: అదరగొట్టిన రోహిత్ సేన.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సూర్య.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ విధ్వంసం..
Team India
Venkata Chari
|

Updated on: Oct 10, 2022 | 5:24 PM

Share

టీ20 ప్రపంచకప్ 2022కి ముందు టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో టీం బలాన్ని మరోసారి పరీక్షించుకోనుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో భారత్ సులభంగా గెలిచింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 158 పరుగులు చేయగా, వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుత అర్ధ సెంచరీతో భారత్ విజయం సాధించగా, ఆ తర్వాత బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశారు.

లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ ఖాతాలో 2 వికెట్లు పడ్డాయి. యుజ్వేంద్ర చాహల్‌కు 2 వికెట్లు లభించగా, హర్షల్ పటేల్‌కు ఒక వికెట్ లభించింది. పెర్త్‌ పిచ్‌పై భారత బ్యాటింగ్‌ కష్టాల్లో కూరుకుపోగా, బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.

ఇవి కూడా చదవండి

టీమిండియా బ్యాటింగ్ మాత్రం ఫ్లాప్..

వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్స్ ఫ్లాప్ అయ్యారు. కేవలం 3 పరుగులకే రోహిత్ శర్మ ఔటయ్యాడు. అదే సమయంలో అతనితో కలిసి ఓపెనర్‌కు వచ్చిన పంత్ 17 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. హూడా వేగంగా 22 పరుగులు చేసినప్పటికీ.. ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 52 పరుగులు చేసి, వేగంగా అర్ధ సెంచరీ సాధించాడు. అతనితో పాటు హార్దిక్ పాండ్యా 27 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దినేష్ కార్తీక్ అజేయంగా 18 పరుగులు చేసి జట్టును 152 పరుగులకు చేర్చాడు.

సత్తా చాటిన బౌలర్లు..

భారత బ్యాటింగ్ విఫలమైనప్పటికీ, ఆ తర్వాత పెర్త్ పిచ్‌పై బౌలర్లు విధ్వంసం సృష్టించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరుపున 3 ఓవర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలో ఎదురుదెబ్బల నుంచి కోలుకోలేకపోయింది. సామ్ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా జట్టును ఓటమి నుంచి కాపాడేందుకు విఫలయత్న చేశాడు. కానీ, భారత బౌలర్ల బలమైన లైన్ లెంగ్త్ వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుమతించలేదు.

తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆర్‌ అశ్విన్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లిలకు టీమ్‌ ఇండియా విశ్రాంతినిచ్చిందనే విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రాహుల్ మాత్రం ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఈ ఆటగాళ్లు తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆడనున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల ద్వారానే భారత జట్టు ఆస్ట్రేలియా వాతావరణంలో గెలిచేందుకు ప్లాన్ చేస్తోంది.