AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs South Africa: శతక్కొట్టిన శ్రేయస్‌.. చెలరేగిన ఇషాన్‌.. రెండో వన్డేలో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ.. ఢిల్లీలో డిసైడర్‌ మ్యాచ్‌

రాంచీలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 45.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది భారత్. శ్రేయస్‌ అయ్యర్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్‌ కిషన్‌ 93 పరుగులతో రాణించాడు.

India vs South Africa: శతక్కొట్టిన శ్రేయస్‌.. చెలరేగిన ఇషాన్‌.. రెండో వన్డేలో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ.. ఢిల్లీలో డిసైడర్‌ మ్యాచ్‌
Shreyas Iyer
Basha Shek
|

Updated on: Oct 10, 2022 | 12:08 AM

Share

దెబ్బకు దెబ్బ కొట్టింది టీమిండియా. లక్నో వన్డేలో పరాజయానికి.. రాంచీలో ప్రతీకారం తీర్చుకుంది. 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఢిల్లీలో ఎల్లుండి జరిగే మ్యాచ్‌ సిరీస్ డిసైడర్‌గా మారింది. రాంచీలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 45.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది భారత్. శ్రేయస్‌ అయ్యర్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్‌ కిషన్‌ 93 పరుగులతో రాణించాడు. సంజూ శాంసన్‌ 29 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా, శుభ్‌మన్‌ గిల్‌ 28 పరుగులు చేశాడు. కాగా ఈ వన్డేలోనూ కెప్టెన్‌ శిఖర్ ధావన్‌ ఫెయిలయ్యాడు. కేవలం 13 రన్స్‌ మాత్రమే చేశాడు. యువకులు అద్భుతంగా ఆడడంతో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది టీమిండియా. హైదరాబాదీ సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 279 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48 పరుగుల వ్యవధిలో ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు తొందరగానే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీని తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి స్కోరును 200 పరుగులు దాటించారు.

రాణించిన సిరాజ్..

అయ్యర్, కిషన్ రెండు ఎండ్‌ల నుంచి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. కిషన్‌ ఔటైన తర్వాత అయ్యర్‌కు సంజూ శాంసన్‌ జతకలిశారు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. అయ్యర్ 111 బంతుల్లో 113 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు ఉన్నాయి. కాగా కిషన్ 84 బంతుల్లో 93 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా రీజా హెండ్రిక్స్, ఐడాన్ మార్క్‌రామ్‌ రాణించడంతో భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో టీమిండిమా బౌలర్లు రాణించడంతో క్వింటన్ డి కాక్ రూపంలో పర్యాటక జట్టు 7 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత 40 పరుగుల వద్ద మలన్ ఔటయ్యాడు. దీంతో హెండ్రిక్స్ మార్క్రామ్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు చేయడంతో పాటు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు స్కోరును 169 పరుగులకు చేర్చారు. ఈ భాగస్వామ్యాన్ని మహ్మద్ సిరాజ్ బ్రేక్ చేశాడు. 74 పరుగుల వద్ద హెండ్రిక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.

ఇవి కూడా చదవండి

హెండ్రిక్స్‌ ఔటయ్యాక క్లాసెన్‌తో కలిసి మార్క్‌రామ్ జట్టు స్కోరును 200 దాటించాడు. అయితే 215 పరుగుల స్కోరు వద్ద, దక్షిణాఫ్రికాకు క్లాసెన్, మార్క్‌రామ్ వికెట్ల రూపంలో వరుసగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. డేవిడ్ మిల్లర్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వేన్ పార్నెల్ 16 పరుగులు చేశాడు. ఆఖర్లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు బ్రేకులు వేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. సిరాజ్ 3 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. సెంచరీతో టీమిండియాను గెలిపించిన శ్రేయస్‌ అయ్యర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..