IND vs SA: వన్డే సిరీస్ నుంచి దీపక్ చాహర్ ఔట్.. జట్టులోకి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా స్టాండ్‌బై ప్లేయర్‌గా చాహర్ ఎంపికయ్యాడు. బుమ్రా గాయపడి టీ20 ప్రపంచకప్‌కు దూరమైనందున, బుమ్రా స్థానంలో చాహర్ జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గాయపడిన దీపక్ చాహర్ స్థానంలో దక్షిణాఫ్రికాతో జరిగే మిగిలిన రెండు వన్డేలకు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యాడు. గాయపడిన చాహర్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్తాడని, అక్కడ వైద్య బృందం అతనిని పర్యవేక్షిస్తుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. చాహర్ గాయం పెద్దగా ఏమీ లేదని, త్వరగా కోలుకోవాలని టీమ్ ఇండియా అభిమానులు ఆశిస్తున్నారని ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా స్టాండ్‌బై ప్లేయర్‌గా చాహర్ ఎంపికయ్యాడు. బుమ్రా గాయపడి టీ20 ప్రపంచకప్‌కు దూరమైనందున, బుమ్రా స్థానంలో చాహర్ జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు వార్మప్ సమయంలో గాయపడిన దీపక్ మొదటి వన్డే మ్యాచ్‌లో కూడా ఆడలేదు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని భావించిన దీపక్ ఈ వన్డే సిరీస్‌కు దూరం కావడం టీమిండియాకు ఎదురుదెబ్బే. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్23న పాక్‌తో తన పోరాటాన్ని ప్రారంభించనుంది భారతజట్టు. అయితే ఆ మ్యాచ్ నాటికి దీపక్ చాహర్ ఫిట్ అవుతాడని బీసీసీఐ భావిస్తోంది.ఇప్పటికే బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లను గాయాలతో కోల్పోయిన టీమ్ ఇండియాకు దీపక్ చాహర్ గాయం కూడా గట్టి దెబ్బలా మారింది. అలాగే అన్ని జట్లూ తమ తమ ప్రపంచ కప్ జట్టులను ఖరారు చేసేందుకు అక్టోబర్ 9 చివరి తేదీ. కాబట్టి బుమ్రాకు బదులుగా చాహర్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే మరో రెండు రోజుల్లో ఫిట్‌గా ఉండాల్సిందే.
చాలా రోజుల తర్వాత సుందర్‌కి ఛాన్స్..
సుందర్ కూడా గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. కౌంటీలో ఆడుతున్న సమయంలో సుందర్ భుజానికి గాయమైంది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్న సుందర్ ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. సుందర్ చివరిసారిగా 11 ఫిబ్రవరి 2022న వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లో టీమ్ ఇండియా తరపున ఆడాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ ఆడాడు.
చివరి 2 మ్యాచ్‌లకు భారత జట్టు:
శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్.
? NEWS ?: Washington Sundar replaces Deepak Chahar in ODI squad. #TeamIndia | #INDvSA
More Details ?https://t.co/uBidugMgK4
— BCCI (@BCCI) October 8, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..