David Miller: స్టార్ క్రికెటర్ ఇంట తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో కన్నుమూసిన కిల్లర్ మిల్లర్ కూతురు
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్యాన్సర్‌తో బాధపడుతోన్న అతని కుమార్తె కన్నుమూసింది. ఈ విషయాన్ని మిల్లరే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్యాన్సర్‌తో బాధపడుతోన్న అతని కుమార్తె కన్నుమూసింది. ఈ విషయాన్ని మిల్లరే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన పాపతో గడిపిన అద్భుత క్షణాలను ఓ వీడియో రూపంలో పొందు పరచిన డేవిడ్’ రిప్ మై లిటిల్ రాక్‌స్టార్. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తోటి క్రికెటర్లు, అభిమానులు డేవిడ్ మిల్లర్‌కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. కాగా మిల్లర్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
టీమిండియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిల్లర్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా రెండో టీ20 మ్యాచ్‌లో అజేయంగా 106 పరుగులు చేశాడు. ఇక మొదటి వన్డేలోనూ 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సౌతాఫ్రికా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు వన్డేల సిరీస్ లో ప్రస్తుతం ఆ జట్టు 1-0 తో ముందంజలో ఉంది. ఆదివారం రెండో వన్డే జరగనుంది. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.




View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..