T20 World Cup: ఇరకాటంలో పడేసిన అసభ్య పదజాలం.. టీ20 ప్రపంచ కప్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్?

టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య సిరీస్ జరుగుతోంది. తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ అసభ్యకరంగా మాట్లాడిన మాటలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. దీంతో అతనిపై ఐసీసీ జరిమానా విధించింది.

T20 World Cup: ఇరకాటంలో పడేసిన అసభ్య పదజాలం.. టీ20 ప్రపంచ కప్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్?
Aus Vs Eng 1st T20i aron finch
Follow us
Venkata Chari

|

Updated on: Oct 11, 2022 | 5:06 PM

టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు జరిమానా పడింది. అయితే, ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ నుంచి కూడా ఔటయ్యే ప్రమాదంలో పడ్డాడు. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫించ్ దోషిగా తేలాడు. ఐసీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఆరోన్ ఫించ్ మాట్లాడిన మాటలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. ఈ కారణంగా, ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ని ఉల్లంఘించినందుకు ఆరోన్ ఫించ్ దోషిగా తేలాడు.

కాగా, ఆరోన్ ఫించ్ కూడా ఈ ఆరోపణలను అంగీకరించాడు. దీనికి సంబంధించి అతనికి క్రమశిక్షణ రికార్డులో ఒక పాయింట్ తగ్గించారు. అంటే భవిష్యత్తులో మరోసారి ఇలా చేస్తే అతనిపై భారీ చర్యలకు అవకాశం ఉంటుంది.

గత రెండేళ్లలో ఆరోన్ ఫించ్ చేసిన మొదటి నేరం ఇదే. కానీ, అతనికి ఇంకా ముప్పు ఉంది. ఎందుకంటే ICC నియమాల ప్రకారం, ఒక ఆటగాడి క్రమశిక్షణ రికార్డులో నాలుగు పాయింట్లు తగ్గిస్తే, ఆ ఆటగాడిపై నిషేధం విధించవచ్చు.

ఇవి కూడా చదవండి

అంటే, ఆరోన్ ఫించ్ తన తప్పును పునరావృతం చేస్తే, అతను ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్ లేదా టీ20 ప్రపంచకప్‌నకు కూడా దూరంగా ఉండవచ్చు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఇంకా రెండు టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

టీ20 ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియా జట్టుకు ఆరోన్ ఫించ్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌ జరగనుంది.

టీ20 ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్ స్టార్క్, ఆడమ్ జాంపా.