BH Series: బీహెచ్ సిరీస్ కోసం అప్లై చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

BH Series Registration Plate: BH సిరీస్ నంబర్ ప్లేట్ ప్రధానంగా వాహనాలు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయబడే వాహనాల కోసం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థలో పలు మార్పులు చేస్తూ..

BH Series: బీహెచ్ సిరీస్ కోసం అప్లై చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
Bh Registration
Follow us
Venkata Chari

|

Updated on: Oct 10, 2022 | 6:10 PM

ఏదైనా వాహనం తీసుకున్న తర్వాత, అది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలనే సంగతి తెలిసిందే. ఆ తర్వాతే అన్ని వాహనాలకు నంబర్‌ ప్లేట్లు జారీ చేస్తారు. ఈ నంబర్ ప్లేట్లలో ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ చూసి ఏ వాహనం ఏ రాష్ట్రానికి చెందినదో ఇట్టే తెలుసుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి UK, ఢిల్లీకి DL, హర్యానాకు HR, తెలంగాణకు TS, ఆంధ్రప్రదేశ్ AP లాంటివి గుర్తులు కేటాయిస్తారు. ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు రాష్ట్రాల వారీగా జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన సూచనల ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ కోసం BH సిరీస్ ప్రారంభించింది. ఈ సిరీస్ అర్థమేమిటంటే ఈ వాహనం భారతదేశానికి చెందినది అని సూచిస్తుంది. అంటే ఇది ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించినది కాదని, ఇది దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. అయితే, ఇది ప్రస్తుతం కొత్త వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంది.

ప్రస్తుతం BH సిరీస్ నంబర్ ప్లేట్ పై చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటి, దానికి సంబంధించిన అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

BH సిరీస్ ప్రయోజనాలు..

ఇవి కూడా చదవండి

ఈ BH సిరీస్ నంబర్ ప్లేట్ ప్రధానంగా వాహనాలు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయబడే వాహనాల కోసం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థలో, వాహనం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేస్తున్నప్పుడు, కొత్త పేపర్లు లేదా పత్రాలను తయారు చేయాలి. ప్రతిసారీ కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంది. ఈ మొత్తం ప్రక్రియకు చాలా సమయం పట్టేది. కానీ, ఇప్పుడు అలాంటి వాహనాలు త్వరలో ఈ అవాంతరం నుంచి బయటపడనున్నాయి. కొత్త BH సిరీస్ కారణంగా ఇకపై ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌తో దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన పని ఉండదు. వివిధ రాష్ట్రాలకు మారుతున్న ఏదైనా వ్యాపారం, ప్రభుత్వ, ప్రైవేట్ విభాగం వారంతా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

BH సిరీస్ నంబర్ ప్లేట్ ముఖ్యాంశాలు..

నమోదు ప్రక్రియ — ఆన్‌లైన్ ప్రక్రియ

రిజిస్ట్రేషన్ ప్రారంభం — 15 సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది

అధికారిక వెబ్‌సైట్ — parivahan.gov.in

  1. BH సిరీస్ నంబర్ ప్లేట్‌లను ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారే డ్రైవర్లు మాత్రమే తీసుకోగలరు.
  2. BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 సెప్టెంబర్ 2021న ప్రారంభించారు.
  3. దరఖాస్తుదారులందరూ ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  4. డీజిల్‌తో నడిచే వాహనాలకు సాధారణ మొత్తం కంటే 2 శాతం అదనపు రుసుము విధించనున్నారు.
  5. అయితే, EV వాహనాల కొత్త నంబర్ ప్లేట్‌లను పొందడానికి, ఫీజు మొత్తంలో 2 శాతం రాయితీ అందించనున్నారు.
  6. BH సిరీస్ నంబర్ ప్లేట్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ సంవత్సరంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మళ్లీ BH, నంబర్, చివరిలో అక్షరాలు ఉంటాయి. అంటే – 21 BH 1234 XX 21 – రిజిస్ట్రేషన్ సంవత్సరం (నమోదు సంవత్సరం చివరి రెండు అంకెలు)
  7. BH – భారతదేశం
  8. 1234 – సంఖ్య (యాదృచ్ఛిక సంఖ్య)
  9. XX – ఈ అక్షరాలు (AA నుంచి ZZ వరకు)
  10. ఇందులో I, O అనే అక్షరాలు ఉపయోగించరు.
  11. ఈ సిరీస్ నంబర్ కోడ్‌లు దరఖాస్తుదారులకు యాదృచ్ఛికంగా మాత్రమే పంపిణీ చేస్తారు.
  12. దీని మొత్తం పని డిజిటల్ రూపంలో మాత్రమే పూర్తవుతుంది.

BH సిరీస్ నంబర్ ప్లేట్ ప్రయోజనాలు..

మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, ఎవరైనా నమోదిత రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రంలో 12 నెలలకు పైగా నివసిస్తుంటే, అతను కొత్త రాష్ట్రంలో నమోదు చేసుకోవాలి. దీనికి చాలా సమయం పట్టేంది. కానీ, ఇప్పుడు కొత్త BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం ఎలాంటి ఇబ్బందు పడాల్సిన అవసరం లేదు.

BH సిరీస్ నంబర్ ప్లేట్‌తో, వాహనం దేశంలోని ఏ ప్రాంతంలోనైనా తిరుగుతుంది. ఇందులో కాలపరిమితి ఉండదు. ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికే దీని గరిష్ట ప్రయోజనం.

పాత సిరీస్ లో నమోదు చేసుకున్న ప్రతిసారీ, ముందుగానే రహదారి పన్ను చెల్లించాల్సి ఉండేది. పాత రాష్ట్రంలో జమ చేసిన పన్నును తిరిగి క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియకు కూడా చాలా సమయం పడుతుంది. అలాగే వివిధ రాష్ట్రాలు వేర్వేరు రహదారి పన్నులను కలిగి ఉంటాయి. దీని వలన ఇది చాలా ఆలస్యం అయ్యేది. డ్రైవర్లకు అసౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సమస్య ఈ కొత్త సిరీస్‌తో తప్పిపోనుంది.

దరఖాస్తుకు అర్హతలు..

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన ఈ సిరీస్‌లో, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేసే వ్యక్తులు, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లే వ్యక్తుల కోసం ఇది జారీ చేశారు. భారత్ సిరీస్ ( BH సిరీస్ నంబర్ ప్లేట్) కింద వాహన రిజిస్ట్రేషన్ / రిజిస్ట్రేషన్ సౌకర్యం ఈ వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు..

రక్షణ సిబ్బంది..

కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగంలోని ఆ కంపెనీలు/సంస్థల ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంస్థలకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యాలయాలు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి..

ఈ సిరీస్ నంబర్ ప్లేట్‌ను తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన విధానాన్ని అనుసరించవచ్చు..

కొత్త వాహనం కొనుగోలుపై డీలర్ ద్వారా ఫారమ్ 20ని ఆన్‌లైన్‌లో నింపాలి. దీని కోసం మీరు అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి.

రిజిస్ట్రేషన్ సమయంలో, దరఖాస్తుదారుకి కొన్ని అవసరమైన పత్రాలు అవసరం. అధికారిక గుర్తింపు కార్డు (అధికారిక ID కార్డ్), వర్కింగ్ సర్టిఫికేట్ (ఫారమ్-60) వంటివి – ప్రైవేట్ ఉద్యోగుల కోసం పత్రాలు మొదలైనవి.

ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక గుర్తింపు కార్డులు, ప్రైవేట్ ఉద్యోగులు వర్కింగ్ సర్టిఫికేట్లను ఇవ్వవలసి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, దరఖాస్తుదారు వాహనానికి BH సిరీస్ నంబర్ ప్లేట్ జారీ చేయనుంది.

ఇది నలుపు, తెలుపు రంగులలో ఉంటుంది.

BH సిరీస్ నంబర్ ప్లేట్ ఫీజు..

BH సిరీస్ నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారులు ఎలాంటి రుసుమును వసూలు చేయరు. అర్హులైన దరఖాస్తుదారులందరూ దీని కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ సమయంలో 2 సంవత్సరాల పాటు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వివిధ స్లాబ్ ధరలతో వివిధ రకాల వాహనాలకు ఫీజు మారుతుంది. ఉదాహరణకు, వాహనం విలువ రూ. 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, వారు 12 శాతం పన్ను చెల్లించాలి. అలాగే రూ. 10 నుంచి రూ. 20 లక్షల ధర ఉన్న వాహనాలపై 10 శాతం పన్ను, రూ.10 లక్షల లోపు వాహనాలకు 8 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?