AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sourav Ganguly: ఐపీఎల్ ఛైర్మన్ పదవి వద్దన్న గంగూలీ.. ఐసీసీలో చక్రం తిప్పేందుకేనా?

దాదాకి ఐపీఎల్ ఛైర్మన్ పదవి ఆఫర్ వచ్చింది. కానీ గంగూలీ మాత్రం ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. BCCI సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న తర్వాత BCCIలోని సబ్‌కమిటీకి హెడ్‌గా ఉండడం నాకు ఇష్టం లేదంటూ ఆయన చెప్పినట్లు సమాచారం.

Sourav Ganguly: ఐపీఎల్ ఛైర్మన్ పదవి వద్దన్న గంగూలీ.. ఐసీసీలో చక్రం తిప్పేందుకేనా?
Sourav Ganguly
Follow us
Basha Shek

|

Updated on: Oct 11, 2022 | 9:05 PM

సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్‌ నామరూపాలు మార్చిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు. కేవలం ఆటగాడిగానే కాదు కెప్టెన్‌గానే జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అన్నిటికీ మించి ఫిక్సింగ్‌ ఆరోపణల్లో కూరుకుపోయిన జట్టుకు పునఃవైభవం తెచ్చాడు. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ జట్టును ముందుండి గెలిపించాడు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఐసీసీ తర్వాతి ఛైర్మన్‌గా గంగూలీనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే అక్టోబరు 18తో బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో దాదా నెక్స్ట్ఏంటనేది అందరి క్వశ్చన్‌. అయితే ఇంతలోనే దానికి ఆన్సర్‌ కూడా లభించింది. నెక్ట్స్‌ ఐసీసీ ఛైర్మన్‌గా గంగూలీకి ఛాన్స్‌ ఇవ్వాలని క్రికెట్‌ పెద్దలు ఆశిస్తున్నారట. న్యూఢిల్లీలో భారత క్రికెట్ బోర్డు స్టేక్‌హోల్డర్స్‌‌తో మీటింగ్‌ తర్వాత ఈ ఊహాగానాలు బయటికి వచ్చాయి. అయితే ఇదే సమావేశంలో దాదాకి ఐపీఎల్ ఛైర్మన్ పదవి ఆఫర్ వచ్చింది. కానీ గంగూలీ మాత్రం ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. BCCI సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న తర్వాత BCCIలోని సబ్‌కమిటీకి హెడ్‌గా ఉండడం నాకు ఇష్టం లేదంటూ ఆయన చెప్పినట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడు రెండోసారి తన పదవిలో కొనసాగేందుకు ఆసక్తిగా ఉన్నట్లు నివేదికలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తరఫున దాదాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌‌గా పంపాలని భారత క్రికెట్ బోర్డు పెద్దలు ఆశిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే వీటికి మరింత బలం చేకురేలా గంగూలీ స్థానంలో తర్వాతి బీసీసీఐ ప్రెసిడెంట్‌గా 1983 వరల్డ్‌కప్ హీరో రోజర్ బిన్నీ‌ని నియమకం దాదాపు ఖాయం అయ్యింది. దీంతో దాదాకి ICC ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌ అవకాశాలపై భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవ్వుతున్నాయి. క్రిక్‌బజ్ అంచనాల ప్రకారం, న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పనితీరు కనబరచలేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో దాదాకి అవకాశాలు తక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ఈ వార్తల్లో నిజమెంత అనేది అక్టోబర్ 18తో తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..