టార్గెట్ 2023 వన్డే ప్రపంచ కప్.. ధోని మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ.. యువ భారత్‌ను నడిపిస్తోన్న వీవీఎస్ లక్ష్మణ్..

2023 ODI World Cup: బ్యాటర్‌గా ఉన్నప్పుడు కూడా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీల హయాంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అందుకు కారణం అతని విజయాలు మాత్రమే. ఆస్ట్రేలియాలోని క్రికెట్ అభిమానులు..

టార్గెట్ 2023 వన్డే ప్రపంచ కప్.. ధోని మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ.. యువ భారత్‌ను నడిపిస్తోన్న వీవీఎస్ లక్ష్మణ్..
2023 Odi World Cup Team Ind
Follow us
Venkata Chari

|

Updated on: Oct 11, 2022 | 8:56 PM

కొంతమంది నిశ్శబ్దంగా తమ పనిని పూర్తి చేస్తుంటారు. ఫలితాలతోపాటు ఎన్నో మార్పులు కూడా చూస్తూ, విజయాలు సాధింస్తుంటారు. అలాంటి వారిలో భారత మాజీ స్టైలీష్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ ఒకరు. లక్ష్మణ్ ఎప్పుడూ నిరాడంబరతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. బ్యాటర్‌గా ఉన్నప్పుడు కూడా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీల హయాంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అందుకు కారణం అతని విజయాలు మాత్రమే. ఆస్ట్రేలియాలోని క్రికెట్ అభిమానులు తరచుగా లక్ష్మణ్‌ను సచిన్‌తో సమానంగా లేదా మాస్ట్రో కంటే మెరుగైన స్థానంలో ఉంచుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

గత కొన్ని నెలలుగా, లక్ష్మణ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా రెండో జట్టును నడిపిస్తున్నాడు. యువ భారత జట్టుకు మార్గనిర్దేశం చేస్తూ, అద్భుత విజయాలు సాధిస్తున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలో లక్ష్మణ్ నేతృత్వంలోని అన్ని సిరీస్‌లను భారత్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 12 ఏళ్లుగా సౌతాఫ్రికా జట్టుపై తీరని కలను టీమిండియాకు అందించాడు. ఇది అత్యుత్తమ భారత జట్టు కాదు. బలమైన దక్షిణాఫ్రికా జట్టును, కేవలం యువ జట్టుతో బరిలోకి దిగి, విజయం సాధించాడు.

రవిశాస్త్రి చీఫ్ కోచ్‌గా ఉన్నప్పుడు, ద్రవిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ, U-19 జట్లతో పనిచేశాడు. శుభమాన్ గిల్, మొహమ్మద్ సిరాజ్ వంటి యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశాడు. ద్రవిడ్‌తో పోల్చితే లక్ష్మణ్ తక్కువ కాలాన్ని కలిగి ఉన్నాడు. అయితే అతను జట్టును మంచి ఉత్సాహంతో ఉంచడానికి, ఫామ్ లేదా ఫిట్‌నెస్‌లో లేని సీనియర్ ఆటగాళ్లను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండేలా చేయడంలో వంద శాతం విజయం సాధించాడు.

ఇవి కూడా చదవండి

“2023లో జరిగే 50-ఓవర్ల ప్రపంచ కప్‌లో బరిలోకి దిగేందుకు సరైన జట్టును పొందడం సెలెక్టర్లకు కష్టంగా ఉంటుంది. యువకులందరూ బాగా రాణిస్తున్నారు. ప్రధాన ఆటగాళ్లు తిరిగి వచ్చిన తర్వాత వారికి ఎక్కువ అవకాశాలు లభించవని వారికి తెలుసు. కానీ, ఇది ఒక అవకాశం. బాగా రాణించండి. బలమైన జట్టును ఎంచుకునేప్పుడు, మీరు కూడా ఓ ఆఫ్షన్ కావాలి” అంటూ లక్ష్మణ్ కోరాడు.

అయ్యర్, కిషన్ పోటాపోటీగా..

ఈ మ్యాచ్‌కు ముందు, శ్రేయాస్ అయ్యర్ గత 5 ఇన్నింగ్స్‌ల్లో 4 అర్ధసెంచరీలు చేశాడు. కొన్నింటిని సెంచరీలుగా మార్చలేకపోయినందుకు నిరాశ చెందానంటూ అయ్యర్ ఆవేదన చెందినట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే, ఆదివారం రాంచీలో ప్రోటీస్‌పై మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కొట్టి.. ఆ కోరికను కూడా అయ్యర్ నెరవేర్చుకున్నాడు.

షార్ట్ పిచ్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో అయ్యర్ సామర్థ్యం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే అతను రాంచీలో చక్కగా సమాధానమిచ్చాడు.

దక్షిణాఫ్రికా వ్యాఖ్యాత క్రిస్ మోరిస్, అయ్యర్ షార్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దాడికి వ్యతిరేకంగా కలవరపడలేదని, అతని విజయానికి భారతీయులు గర్వపడాలని పేర్కొన్నాడు.

మరో ఆటగాడు స్థానిక కుర్రాడు ఇషాన్ కిషన్ 84 బంతుల్లో 93 పరుగులతో ఆకట్టుకున్నాడు. కిషన్ 7 సిక్సర్లు కొట్టాడు. అందులో కెప్టెన్ కేశవ్ మహారాజ్‌పై 2, ఆండ్రీ నార్ట్జేపై కొన్ని సిక్సర్లు బాదేశాడు.

సంజూ శాంసన్ సైలెంట్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. శాంసన్ అంతకు ముందు మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ ముగ్గురూ ఓపెనింగ్ చేస్తున్న మిడిల్ ఆర్డర్ స్పాట్‌కి ఓ ఆఫ్షన్‌గా మారారు.

కుల్దీప్ యాదవ్‌ను తీర్చిదిద్దుతున్నాడు..

కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌లను గెలుపొందించేలా బలీయమైన స్పిన్ ద్వయాన్ని ఏర్పాటు చేశాడు. MS ధోని కెప్టెన్‌గా ఉన్న హయంలో స్పిన్నర్లను ఎంతో చక్కగా ఉపయోగించుకుంటూ ఎన్నో విజయాలు సాధించాడు. కానీ, కుల్దీప్ ఇకపై సెలెక్టర్ల ఎంపిక కాకపోవడం విచారకరం. జట్టులోకి వస్తూ, పోతూ ఉంటున్నాడు. ఇక ముఖ్యంగా టీ20 జట్టులో మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు.

అయితే, భారత్‌లో తదుపరి ప్రపంచకప్‌తో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం చాలా కీలకమైనందున కుల్దీప్ పాత్ర కీలకంగా ఉంటుందని చాలా మంది మాజీ ఆటగాళ్ళు భావిస్తున్నారు.

కీలక సమయాల్లో అదరగొట్టిన కుల్దీప్.. రాంచీలో ఆ కోణాన్ని చూపించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రమాదకరమైన హెన్రిచ్ క్లాసెన్‌ను లెగ్ స్టంప్‌పై గూగ్లీతో పెవిలియన్ చేర్చిన కుల్దీప్.. కీలకంగా మారాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా సత్తా చాటడంతో మిడిల్ ఓవర్ స్ట్రైక్స్ నుంచి కోలుకోలేకపోయారు.

కుల్దీప్ తన బౌలింగ్ యాక్షన్‌లో కొన్ని మార్పులు చేశాడు. అతనికి అన్ని విధాలుగా మద్దతు ఇచ్చినందుకు టీమ్ మేనేజ్‌మెంట్, ముఖ్యంగా లక్ష్మణ్ ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది. లక్ష్మణ్‌కు కుల్‌దీప్‌లో ఒక మ్యాచ్ విన్నర్ ఉన్నారని తెలుసు. పెద్ద టోర్నమెంట్‌లు ఆడుతున్నప్పుడు బౌలర్‌గా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతాడని విశ్వసించాడు.

విజయం తర్వాత సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ, భారత జట్టు లోతులను చూస్తుంటే గర్వంగా అనిపిస్తుందని తెలిపాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ లాంటి కీలక ప్లేయర్లు లేకుండా అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టును టీమిండియా ఓడించిందని గుర్తు చేశాడు. అయితే, ఈ విజయంలో లక్ష్మణ్‌కు క్రెడిట్ ఇవ్వలేదు. కానీ, ఎవరు నమ్మనా, నమ్మకున్నా.. ఈ హైదరాబాదీ మాజీ సొగసరి మాత్రం జట్టును ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు అనేందుకు ఈ విజయాలే కారణంగా గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది.