AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: ‘మహాతల్లీ పంత్‌ని వదలవా..? ఎక్కడికెళ్లినా సైకోలా వెంటబడతావెందుకు?’

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలా ఆస్ట్రేలియా ప్రయాణంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే.. ప్రముఖ ఇండియన్‌ క్రికెటర్‌ రిషబ్ పంత్, ఊర్వశి రౌతెలా ప్రేమ వ్యవహారంపై..

Urvashi Rautela: 'మహాతల్లీ పంత్‌ని వదలవా..? ఎక్కడికెళ్లినా సైకోలా వెంటబడతావెందుకు?'
Urvashi Rautela
Srilakshmi C
|

Updated on: Oct 11, 2022 | 6:33 PM

Share

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలా ఆస్ట్రేలియా ప్రయాణంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే.. ప్రముఖ ఇండియన్‌ క్రికెటర్‌ రిషబ్ పంత్, ఊర్వశి రౌతెలా ప్రేమ వ్యవహారంపై గత కొంత కాలంగా పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐతే ఈ రూమర్లపై రిషబ్‌ పంత్ మాత్రం కాస్త గట్టిగానే స్పందించాడు. తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఊర్వశి రౌతెలాను బ్లాక్‌ చేశాడు కూడా. ఆర్‌పీ అనే వ్యక్తి తనను కలిసేందుకు ఢిల్లీ హోటల్లో రాత్రి ఎదురు చూశాడని, కానీ తనకు కుదరలేదని ఊర్వశి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

దీనిపై స్పందించిన పంత్‌.. ‘కొంతమంది పాపులారిటీ కోసం ఇలా ప్రవర్తిస్తుంటారని’ చురకలంటించాడు. దీంతో రెచ్చిపోయిన ఊర్వశీ.. ‘అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నీలాంటి పిల్ల బచ్చాల వల్ల బద్నాం అవ్వడానికి నేనేం చిన్నపిల్లను కాదు. నకరాలు చేస్తే నీ ఇజ్జత్ తీస్తా’అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘సిస్టర్‌, నన్ను ఒంటరిగా వదిలేయ్‌’ అని పంత్‌ బదులిచ్చాడు. ఈ వివాదం తర్వాత యూఏఈలో నిర్వహించని ఆసియా కప్‌ గేమ్‌కి వెళ్లింది. టీ20 ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా చేరుకున్న విషయం తెలిసిందే. వీరు ఆస్ట్రేలియా చేరుకున్న రెండు రోజుల తర్వాత ఊర్వశి కూడా ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు, తాను విమానంలో ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ‘ఆస్త్రేలియా చేరుకున్నాను. ఇంకో అడ్వెంచర్‌ ప్రారంభమైంద’ని ఓ పోస్టు పెట్టింది. ఆ తర్వాత మరో ఫొటో పోస్టు చేసి, ‘నా ప్రేమను అనుసరిస్తున్నా.. అది నన్ను ఆస్ట్రేలియాకు చేర్చింది’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఊర్వశి ఆస్ట్రేలియాకు వెళ్లడం, ఆమె సోషల్‌ మీడియా పోస్టులపై నెట్టింట మరోసారి రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. పంత్‌ను ఊర్వశి వేధిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెకు సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ లేదని, ఆస్ట్రేలియాకు పంత్ కోసమే వెళ్లిందని, సైకోలా ప్రవర్తిస్తోందని నెటిజన్లు పలు మీమ్స్‌తో ఊర్వశిని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ విమర్శలను పట్టించుకోని ఊర్వశి మాత్రం.. ‘అతణ్ని ఎలా మర్చిపోగలను? మరణం మనిషికి వస్తుంది. జ్ఞాపకాలకు కాద’ని అంటూ లెహెంగాలో ఉన్న మరో ఫొటోను పోస్టు చేసింది. ఊర్వశి చేసేది ఏ మాత్రం మంచిపని కాదని ఓ నెటిజన్‌ కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నాడు.