Simbu: అప్పుడే ఓటీటీలోకి శింబు కొత్త సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

తెలుగులో లైఫ్‌ ఆఫ్‌ ముత్తు పేరుతో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్‌ విడుదల చేశారు. విడుదలైన యాక్షన్‌ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. మానాడు సినిమా తర్వాత ఈ సినిమా రూపంలో శింబుకు మరో భారీ హిట్‌ దక్కింది.

Simbu: అప్పుడే ఓటీటీలోకి శింబు కొత్త సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Simbu
Follow us
Basha Shek

|

Updated on: Oct 11, 2022 | 9:38 PM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శిలంబరసన్ అలియాస్ శింబు నటించిన చిత్రం వెందు తానింధదు కాడు. క్రియేటివ్‌ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. సిద్ధి ఇద్నాని, రాధికా శరత్ కుమార్, సిద్ధిక్, అప్పుకుట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శింబు అద్భుతంగా నటించాడు. తెలుగులో లైఫ్‌ ఆఫ్‌ ముత్తు పేరుతో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్‌ విడుదల చేశారు. విడుదలైన యాక్షన్‌ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. మానాడు సినిమా తర్వాత ఈ సినిమా రూపంలో శింబుకు మరో భారీ హిట్‌ దక్కింది. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అక్టోబర్‌ 13 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్‌ హక్కుల కోసం భారీ మొత్తంలో చెల్లించినట్లు సమాచారం. అయితే సోషల్‌ మీడియా వేదికగా విడుదల తేదీని ప్రకటించిన సదరు సంస్థ తెలుగు వెర్షన్‌పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పని కోసం ముంబయికి వచ్చిన శింబు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారిపోయాడు? అన్ని సమస్యలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రానున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ