Krishna Vrinda Vihari: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కృష్ణ వ్రింద విహారి.. దీపావళికి సందడి చేయనున్న నాగశౌర్య.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

రొమాంటిక్ ఎంటర్టైనర్‏గా రూపొందించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఇక ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ మూవీలో ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.

Krishna Vrinda Vihari: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కృష్ణ వ్రింద విహారి.. దీపావళికి సందడి చేయనున్న నాగశౌర్య.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Krishna Vrinda Vihari
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 12, 2022 | 12:25 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఇందులో శౌర్య సరసన షిర్లే షెటియా కథానాయికగా నటించింది. డైరెక్టర్ అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్‏గా రూపొందించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఇక ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ మూవీలో ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 23 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లుగా సమాచారం.

సంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలో పుట్టిపెరిగిన కృష్ణాచారి.. ఉద్యోగం కోసం హైదరాబాద్ చేరుకుంటాడు. ఐటీ కంపెనీలో టెక్నికల్ ట్రైనర్‏గా చేరతాడు. అక్కడే మేనేజర్ గా పనిచేసే వ్రిందా అనే అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఎలాగైనా ఆమెతో జీవితం పంచుకోవాలనుకుంటాడు.కానీ ఆ అమ్మాయి ఓ సమస్యతో బాధపడుతుంది. దీంతో పెళ్లికి నిరాకరిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆ సమస్యను దాచి పెళ్లికి పెద్ధల్ని ఒప్పించేందుకు కృష్ణ ఎన్ని అబద్దాలు ఆడాడు ? పెళ్లి తర్వాత ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడు అనేది కథ. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ద్వారా సినీ ప్రియుల ముందుకు మరోసారి రాబోతుంది.