Samantha: అమెరికాలో జక్కన్న క్రేజ్ చూస్తే వారెవ్వా అనాల్సిందే.. ఆనందంలో సమంత.. ఎందుకంటే..

అక్కడ అమెరికన్స్ నుంచి ఈ మూవీకి విశేష స్పందన లభించింది. థియేటర్‏లో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ సినిమా తర్వాత జక్కన్న రూపొందించిన ఈగ చిత్రాన్ని కూడా బియాండ్ ఫెస్ట్‏లో ప్రదర్శించారు.

Samantha: అమెరికాలో జక్కన్న క్రేజ్ చూస్తే వారెవ్వా అనాల్సిందే.. ఆనందంలో సమంత.. ఎందుకంటే..
Eega
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 12, 2022 | 8:47 AM

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిన జక్కన్న.. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో హాలీవుడ్ డైరెక్టర్లను సైతం మెప్పించాడు. ఈ సినిమాతో ప్రేక్షకులే కాకుండా సినీ విశ్లేషకులు సైతం ఫిదా అయ్యారు. రాజమౌళి స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల అమెరికాలోని బియాండ్ ఫెస్ట్‏లో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ అమెరికన్స్ నుంచి ఈ మూవీకి విశేష స్పందన లభించింది. థియేటర్‏లో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ సినిమా తర్వాత జక్కన్న రూపొందించిన ఈగ చిత్రాన్ని కూడా బియాండ్ ఫెస్ట్‏లో ప్రదర్శించారు.

ఈ సినిమా చూస్తున్నంత సేపు చప్పుట్లు కొడుతూ.. అరుపులతో థియేటర్లలో రచ్చ చేశారు ప్రేక్షకులు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఈ వీడియోస్ నెట్టింట షేర్ చేస్తూ సంతోషంలో తేలిపోయారు చిత్రయూనిట్. నాని, సమంత, కిచ్చా సుదీప్ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఈగ స్క్రీనింగ్ వీడియోస్ షేర్ చేశారు. ” ఒక దశాబ్దం తరువాత భూమిపై మరొక వైపు నుంచి అదే ప్రేమ అదే శక్తి అందుతుంది. 2012లో మా ఈగ కుటుంబంతోపాటు … మీ అందరితో మా ఫస్ట్ షో జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు నాని. ఇది అందంగా ఉంది అంటూ సామ్ ట్వీట్ చేసింది.

జక్కన్న తెరకెక్కించిన ఈగ చిత్రం 2012లో విడుదలైంది. ఇందులో నాని, సమంత జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా కిచ్చా సుదీప్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్లకు పైగా వసూలు చేసింది. 2012లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో మఖీ పేరుతో హిందీలో విడుదలైంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ