Suriya : ‘విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర చేయడం అస్సలు ఇష్టం లేదు.. కానీ’.. సూర్య షాకింగ్ కామెంట్స్..
సూర్య వేదికపైకి వస్తున్నప్పుడు రోలెక్స్ అంటూ అరుస్తూ హంగామా చేశారు అభిమానులు. దీంతో రోలెక్స్ తిరిగి వస్తున్నారా ? అని హోస్ట్ అడగ్గానే.. సమయమే సమాధానం ఇస్తుందని అనుకుంటున్నాను .. అది వస్తే .. నేను వస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
లోకనాయకుడు కమల్ హాసన్.. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం విక్రమ్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ సునామి సృష్టించింది. అయితే ఈ మూవీకి కమల్ హాసన్ నటన.. లోకేష్ స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా చివరి ఐదు నిమిషాల్లో వచ్చిన సీన్ మరింత హైలెట్గా నిలిచింది. రోలెక్స్ పాత్ర ఎంట్రీతో థియేటర్లలో ఒక్కసారిగా రచ్చ చేశారు అభిమానులు. రోలెక్స్ అంటూ అరుపులతో నానా హంగామా చేశారు. కేవలం ఐదు నిమిషాలు ఉన్న సీన్ సినిమా మొత్తానికి కావాల్సిన స్టఫ్ అందింది. కేవలం రోలెక్స్ పాత్ర ద్వారా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. తమిళ్ స్టార్ సూర్య ఈ రోల్లో మరోసారి అదరగొట్టారు. అత్యంత ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందిన ఈ పాత్ర చేయడం తనకు ఇష్టం లేదని.. ముందు ఈ రోల్ చేసేందుకు నో చెప్పానంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు హీరో సూర్య. ఆదివారం రాత్రి జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ 2022లో సూర్య సూరరై పొట్రు చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. అయితే సూర్య వేదికపైకి వస్తున్నప్పుడు రోలెక్స్ అంటూ అరుస్తూ హంగామా చేశారు అభిమానులు. దీంతో రోలెక్స్ తిరిగి వస్తున్నారా ? అని హోస్ట్ అడగ్గానే.. సమయమే సమాధానం ఇస్తుందని అనుకుంటున్నాను .. అది వస్తే .. నేను వస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
సూర్య మాట్లాడుతూ.. ” ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నా.. నేను జీవితంలో ఏమి చేస్తున్నా.. కమల్ సర్ నాకు ఎప్పుడూ స్పూర్తిగా నిలిచారు. కమల్ సర్ కాల్ చేసి విక్రమ్ సినిమాలో అవకాశం గురించి చెప్పినప్పుడు నేను.. వదిలుకోవాలి అనుకోలేదు. కానీ ఆ రోల్ చేయాలంటే భయంగా అనిపించింది. అదే సమయంలో కమల్ సర్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. భయపెట్టిన పనిని చేస్తే మనకు ఎదుగుదల అని నమ్ముతాను.. దీంతో వెంటనే ఓకే చెప్పేశాను. అది కేవలం ఓ వ్యక్తి కోసమే. ఆయనే కమల్ హాసన్.” అంటూ చెప్పుకొచ్చారు సూర్య.
భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. అలాగే కార్తీ నటిస్తోన ఖైదీ 2 చిత్రంలోనూ సూర్య ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.