AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: ఇంటిసభ్యులకు బిగ్‏బాస్ సర్‏ప్రైజ్.. మాటలతో భర్తలో స్పూర్తి నింపిన ఆదిరెడ్డి అర్థాంగి..

ఇంటి సభ్యులకు బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా గార్డెన్ ఏరియాలో 100 శాతం చార్జ్ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటిసభ్యుడికి కొన్ని సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు.

Bigg Boss 6 Telugu: ఇంటిసభ్యులకు బిగ్‏బాస్ సర్‏ప్రైజ్.. మాటలతో భర్తలో స్పూర్తి నింపిన ఆదిరెడ్డి అర్థాంగి..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Oct 12, 2022 | 9:18 AM

Share

బిగ్‏బాస్ ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ ఇంట్లో మరింత హీట్ పెంచింది. ఇక మంగళవారం నామినేషన్స్ లో ఒక్కొక్కరు చెప్పిన రీజన్స్ గురించి చర్చించుకున్నారు. అయితే ఇంటి సభ్యుల కోసం బిగ్‏బాస్ కొన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాడు. ఆడియో కాల్.. వీడియో కాల్… ఇంటి నుంచి ఫుడ్ అంటూ మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే అంతా సక్రమంగా సాగితే బిగ్‏బాస్ షో ఎలా అవుతుంది. ఇక్కడే అసలు మెలిక పెట్టాడు పెద్ద బాస్. ఇంటి సభ్యులకు బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా గార్డెన్ ఏరియాలో 100 శాతం చార్జ్ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటిసభ్యుడికి కొన్ని సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. అయితే అందులో వారు ఎంచుకునే ప్రతి సర్ ప్రైజ్ కు బదులుగా బ్యాటరీలోని కొంత చార్జ్ తగ్గిపోతుంది. అంతేకాకుండా నియమాలను ఉల్లంఘిస్తే ఛార్జ్ తగ్గిపోతుందని చెప్పాడు. అయితే ఈ టాస్కులో హైలెట్‏గా నిలిచింది ఆదిరెడ్డి మాత్రమే.

ముందుగా శ్రీహాన్‏ను పిలిచి నాన్నతో వీడియో కాల్.. 58 శాతం.. సిరితో ఆడియో కాల్.. 30 శాతం.. ఇంటి నుంచి మటన్ బిర్యానీ కావాలంటే 15 శాతం బ్యాటరీ ఉపయోగించాలని చెప్పాడు. కచ్చితంగా మూడింటిలో ఒక్కదాన్ని సెలక్ట్ చేసుకోవాలి అనడంతో మటన్ బిర్యానీ తీసుకున్నాడు. ఆ తర్వాత సుదీప తన భర్తతో ఆడియో కాల్ మాట్లాడింది. ఇక ఆదిరెడ్డి తన భార్య కూతురితో వీడియో కాల్ మాట్లాడే ఆప్షన్ సెలక్ట్ చేసుకున్నాడు. తన సతీమణి.. కూతురిని చూడగానే ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తన మాటలతో భర్తకు మరింత ధైర్యమిచ్చింది కవిత. ఒకప్పుడు బిగ్‏బాస్ కు వెళ్లొద్దని చెప్పాను. కానీ ఇప్పుడు గర్వపడుతున్నాను.

నీ తప్పు లేనప్పుడు అవతల వ్యక్తి ఎవరైన సరే ఆర్గ్యుమెంట్ చేయి.. అస్సలు వదలొద్దు.. విన్నర్ అయ్యి రావాలి. మూడు నెలలు మేం నిన్ను మిస్ అయ్యాం అనే ప్రశ్నకు నువ్వు విన్నర్ కావడమే సమాధానం అంటూ చెప్పుకొచ్చింది. ఇక భార్య మాటలకు భావోద్వేగానికి గురయ్యాడు ఆదిరెడ్డి. దీంతో గేమ్ బాగా ఆడతానని చెప్పాడు ఆదిరెడ్డి. భార్య కూతురితో మాట్లాడిన ఆనందంలో సంతోషంలో తేలిపోయాడు ఆదిరెడ్డి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!