Unstoppable With NBK 2: నా బెస్ట్ ఫ్రెండ్ ఆయనే.. ఇద్దరమూ కలిసి బాగా తిరిగాం: అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అన్ స్టాపబుల్ సెకెండ్ సీజన్ మొదటి ఎపిసోడ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బావబావమరుదుల మధ్య జరిగిన సరదా సంభాషణలు ఆడియెన్స్‌ను ఆద్యంతం అలరించాయి.
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. గతేడాది ఆహాలో స్ట్రీమింగ్ అయిన మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఛాట్‌షోతో బాలకృష్ణ తన మరో రూపాన్ని అభిమానులకు పరిచయం చేశాడు. ఛాట్‌షోలో భాగంగా సినిమా సెలబ్రిటీలతో ఆయన పేల్చిన డైలాగులు, పంచ్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అంతకుమించి అన్నట్లుగా అన్‌స్టాపబుల్‌విత్ ఎన్బీకే 2 పేరుతో రెండో సీజన్ ప్రసారం కానుంది. అక్టోబర్ 14 న మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమోని విడుదల చేశారు. కాగా మొదటి ఎపిసోడ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బావబావమరుదుల మధ్య జరిగిన సరదా సంభాషణలు ఆడియెన్స్‌ను ఆద్యంతం అలరించాయి.
నా బెస్ట్ ఫ్రెండ్ ఆయనే..
కాగా రాజకీయ దురంధరుడు, పాలనా దక్షకుడు నారా చంద్రబాబు నాయుడుకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? బాల్య మిత్రుడా? లేదా కాలేజీలో సహచరుడా? ఎవరు? సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నోటి వెంట మొట్ట మొదటిసారిగా తనకు అత్యంత ఆత్మీయుడైన స్నేహితుడి పేరు వచ్చింది.. అది కూడా ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ నెల 14న స్ట్రీమింగ్ కాబోతున్న అన్‌స్టాపబుల్ సీజన్-2లో. గెస్ట్‌గా వచ్చిన చంద్రబాబును హోస్ట్ నందమూరి బాలకృష్ణ అడిగిన ప్రశ్న చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. మీతో ఇప్పటి వరకు కలిసి ప్రయాణించిన వారందరిలో బెస్ట్‌ఫ్రెండ్ ఎవరు అని బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తడుముకోకుండా చెప్పిన పేరు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి. ఇప్పటి వరకు వారిద్దరు రాజకీయ శత్రువులనే అనుకున్నాం.. ఇద్దరి మధ్య మంచి మిత్రత్వం ఉందని ఇప్పుడే తెలిసింది. ఆహాలో అక్టోబర్ 14న స్ట్రీమింగ్ కానున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 తొలి ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరి నోటా ఈ ముచ్చటే వినిపిస్తోంది. ఆహా విడుదల చేసిన ఈ ప్రోమోలో అనేక విషయాలపై బాలకృష్ణ ప్రశ్నలు వేశారు. వాటన్నింటికీ చంద్రబాబు తన సహజశైలికి భిన్నంగా సమాధానాలిచ్చారు. ఇప్పుడు బయటకు చెప్పని అనేకానేక విషయాలను చంద్రబాబు చెప్పుకొచ్చారు. మనసు విప్పి మాట్లాడారు. టీజర్ చూస్తుంటే ప్రోగ్రామ్‌పై అమితమైన ఆసక్తి పెరిగింది అందరికీ!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు. 1978లో వీరిద్దరు శాసనసభకు ఎంపికయ్యారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వీరిద్దరు మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకేసారి మంత్రులయ్యారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి తెలుగుదేశంపార్టీలో చేరినప్పటికీ వైఎస్‌తో స్నేహం మాత్రం కొనసాగింది. కష్టసుఖాలను ఇద్దరూ చెప్పుకునేవారు. ఈ విషయాన్ని అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో చంద్రబాబు వివరించారు. అయితే ఆహా ప్రోమోలో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే వైఎస్ అని చెప్పే వరకు మాత్రమే ఉంది. ఆ స్నేహంలోని మధుర జ్ఞాపకాలు, రాజకీయ విభేదాలు, అన్ని పూర్తి ఎపిసోడ్‌లో చూడవచ్చు. వైఎస్ చనిపోయేంత వరకు ఆ స్నేహబంధం అలాగే కొనసాగిందా? రాజకీయ వైరుధ్యాలు ఆ బంధాన్ని తెంచేశాయా అన్నది అన్నది తెలుసుకోవాలంటే ఆహాలో ఈ నెల 14 స్ట్రీమింగ్ కాబోతున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..