Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable With NBK 2: స్విమ్మింగ్‌పూల్‌లో నారా లోకేశ్‌ ఫొటోలపై వివాదం.. చంద్రబాబు రియాక్షన్‌ ఏంటంటే?

అన్నిటికీ మించి ఈసారి బాలయ్య వియ్యంకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు నారా లోకేశ్‌ ఈ షోకు రావడం షోపై ఆసక్తిని పెంచింది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన మొదటి ఎపిసోడ్‌ ప్రోమో అదిరిపోయింది. ముఖ్యంగా హోస్ట్‌ బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు ఇంట్రెస్టింగ్‌ సమాధానాలు ఇచ్చారు.

Unstoppable With NBK 2: స్విమ్మింగ్‌పూల్‌లో నారా లోకేశ్‌ ఫొటోలపై వివాదం.. చంద్రబాబు రియాక్షన్‌ ఏంటంటే?
Unstoppable With Nbk 2
Follow us
Basha Shek

|

Updated on: Oct 14, 2022 | 3:10 PM

సిల్వర్‌స్ర్కీన్‌పై నట విశ్వరూపం చూపించే బాలకృష్ణ బుల్లితెరపైనా సత్తా చాటాడు. ఆహా వేదికగా ప్రసారమైన అన్‌స్టాపబుల్‌ టాక్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించి అభిమానుల మనసును గెల్చుకున్నాడు. ఈఛాట్‌షోలో బాలయ్య పంచ్‌లు, డైలాగులు ఓ రేంజ్‌లో పేలిపోయాయి. పలువురు సినిమా సెలబ్రిటీలతో ఆయన వ్యవహరించిన తీరు టాక్‌షోను సూపర్‌ డూపర్‌ హిట్‌ చేశాయి. కాగా ఈసారి అంతకుమించి అనేలా అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్‌బీకే సీజన్‌2 తో మరోసారి మన ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన థీమ్‌సాంగ్‌, పోస్టర్లు, ట్రైలర్లు అభిమానులతో పాటు సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకున్నాయి. అన్నిటికీ మించి ఈసారి బాలయ్య వియ్యంకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు నారా లోకేశ్‌ ఈ షోకు రావడం షోపై ఆసక్తిని పెంచింది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన మొదటి ఎపిసోడ్‌ ప్రోమో అదిరిపోయింది. ముఖ్యంగా హోస్ట్‌ బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు ఇంట్రెస్టింగ్‌ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌ కాసేపు హోస్ట్‌గా మారిపోయారు. చంద్రబాబు, బాలకృష్ణలపై పలు ప్రశ్నలు సంధించి పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. కాగా మొదటి ఎపిసోడ్‌ అక్టోబర్‌ 14 న స్ట్రీమింగ్‌ కానుంది.

కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ విషయంపై లోకేశ్‌ స్పందన అడగ్గా.. ‘సంకల్పంతో ఆనాడు వెళ్లాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం గతంలో లోకేశ్‌కు సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ బయటికి వచ్చాయి. స్విమ్మింగ్ పూల్‌లో జలకాలు ఆడుతూ, బీచ్ లో తిరుగుతూ కొన్ని ఫొటోలు అప్పట్లో బయటికి వచ్చాయి. సోషల్‌ మీడియాలో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. అప్పటి ప్రతిపక్ష సభ్యులు కూడా వీటిని విపరీతంగా ట్రోల్‌ చేస్తూ లోకేశ్‌పై విమర్శల వర్షం గుప్పించారు. ఇప్పుడివే ఫొటోలను చూపిస్తూ బాలయ్య మరోసారి లోకేష్, చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఫొటోలు అసెంబ్లీ వరకు వెళ్లాయని, ఆ ఫొటోల వెనకున్న మ్యాటరేంటని అన్ స్టాపబుల్ వేదికగా తండ్రీ కొడుకులను అదిగారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ‘మామకు లేని సందేహం నాకెందుకు’ అని చెప్పుకొచ్చారు. అయితే లోకేశ్‌ ఆన్సర్‌ ఏంటన్నది ఫుల్ ఎపిసోడ్ లో తెలియనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..