Unstoppable With NBK 2: 1995 నిర్ణయంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కాకరేపుతున్న అన్‌స్టాపబుల్‌..

పాతికేళ్లు గడిపోయినా ఎన్టీఆర్‌ విషయంలో చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే, పార్టీ కోసమే అదంతా జరగిందని.. దానికి ఎన్టీఆర్‌ కుటుంబీకుల మద్దతు కూడా ఉందంటూ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను టీడీపీ నేతలు ఎప్పటికప్పుడూ తిప్పికొడుతూనే ఉన్నారు.

Unstoppable With NBK 2: 1995 నిర్ణయంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కాకరేపుతున్న అన్‌స్టాపబుల్‌..
Unstoppable With Nbk 2
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2022 | 7:49 PM

ఇప్పటికీ తెలుగు రాజకీయాల్లో సెన్సెషన్.. అసలు 1995లో ఏం జరిగింది.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు.. దించాల్సి వచ్చింది. అన్న గారి తెలుగుదేశం పార్టీని గుప్పిట్లోకి తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు అప్పుడేం చేశారు.. ఆయనకు నందమూరి కుటుంబంలో ఎవరెవరు అండగా నిలిచారు.. వైశ్రాయ్‌ హోటల్‌లో ఏం జరిగింది..? ఎన్టీఆర్‌.. నాడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడారు.. చంద్రబాబు తన నిర్ణయం వెనుక చెప్పిన కారణాలేంటి? వరుసగా.. 1983, 1985, 1994లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టిన ఎన్టీఆర్‌.. తెలుగుదేశం పార్టీపై ఎందుకు పట్టు కోల్పోయారు.. ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికీ.. ఎప్పటికీ ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్సే..

పాతికేళ్లు గడిపోయినా ఎన్టీఆర్‌ విషయంలో చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే, పార్టీ కోసమే అదంతా జరగిందని.. దానికి ఎన్టీఆర్‌ కుటుంబీకుల మద్దతు కూడా ఉందంటూ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను టీడీపీ నేతలు ఎప్పటికప్పుడూ తిప్పికొడుతూనే ఉన్నారు. 1995, సెప్టెంబర్‌లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని దింపేసి చంద్రబాబు అధికార పగ్గాలను చేపట్టిన చంద్రబాబు నాయుడు.. 1995 ఎపిసోడ్‌పై తాజాగా పెదవివిప్పారు. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్‌ షో అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్‌బీకేలో చంద్రబాబు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతేడాది ఆహాలో స్ట్రీమింగ్‌ అయి సూపర్‌ హిట్‌గా నిలిచిన మొదటి సీజన్‌కు కొనసాగింపుగా.. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 2 శుక్రవారం నుంచి ప్రసారం కానుంది. అక్టోబర్‌ 14 న మొదటి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. కాగా మొదటి ఎపిసోడ్‌కి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీనికి సంబందించి ఆహా విడుదల చేసిన ప్రోమో రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా బావబావమరుదులు.. చంద్రబాబు, బాలకృష్ణ మధ్య జరిగిన సరదా సంభాషణలతో పాటు.. రాజకీయానికి సంబంధించిన హాట్‌ టాపిక్స్‌ చర్చకు వచ్చాయి.

అన్‌స్టాపబుల్‌ షో ప్రోమోలో.. చంద్రబాబు నాయుడు లైఫ్‌లో అతి పెద్ద నిర్ణయం ఏంటనేది బాలయ్య ప్రశ్నించగా “1995 నిర్ణయం” అని చంద్రబాబు తెలిపారు. ఒక వ్యక్తిగా మిమ్మల్ని నేను అడుగుతున్నా.. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా?.. అని చంద్రబాబు ప్రశ్నించగా, ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది బావా.. అంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు.. ఆయన్ను కాళ్లు పట్టుకుని అడుక్కున్నా నా మాట వినండి అని, కానీ వినలేదు.. అంటూ చంద్రబాబు కామెంట్స్‌ చేశారు. అయితే ప్రోమోలో ఈ సన్నివేశాన్ని సస్పెన్స్‌లోనే ఉంచారు. ఆహాలో శుక్రవారం నాడు (అక్టోబర్‌ 14) ప్రసారం అయ్యే మొత్తం ఎపిసోడ్‌తోనే ఈ విషయంలో ఫుల్‌ క్లారిటీ రానుంది. అసలు నాటి నిర్ణయం వెనుక దోహద పడిన పరిస్థితులు.. రాజకీయ పరిణామాలు.. దీనిపై చంద్రబాబు ఏం చెప్పబోతున్నారనేది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాలతోపాటు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

ప్రోమో చూడండి..

1995, సెప్టెంబర్‌లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని దింపేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు.. నాటి నిర్ణయం వెనుక కారణాలు, నందమూరి కుటుంబం నుంచి ఎవరెవరు తనకు మద్దతు తెలిపారు.. అనే అంశాలను క్లుప్తంగా అన్‌స్టాపబుల్‌ 2లో చెప్పనున్నారని తెలుస్తోంది. ఇంకా చంద్రబాబు వైఎస్‌ఆర్‌తో స్నేహం.. ఇంకా పలు ఆసక్తికర విషయాలపై కూడా సంభాషించారు. ఆహా వేదికగా శుక్రవారం ప్రసారం కానున్న.. అన్‌స్టాపబుల్‌ 2 ఫస్ట్‌ ఎపిసోడ్‌ ప్రోమో ప్రస్తుతం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..