AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio 5G: అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జియో 5జీ సేవలు.. ఏయే నగరాల్లో అంటే?

తెలుగు రాష్ట్రాల్లోనూ జియో 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో యాజమాన్యం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో నెట్‌ వర్క్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.

Jio 5G: అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జియో 5జీ సేవలు.. ఏయే నగరాల్లో అంటే?
Jio 5g
Basha Shek
|

Updated on: Oct 12, 2022 | 6:20 PM

Share

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు అందుబాటులోకి రానే వచ్చాయి. దసరా పండుగను పురస్కరించుకుని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ప్రయోగాత్మకంగా రిలయన్స్‌ జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జియో వెల్కమ్ ఆఫర్ పేరుతో ప్రారంభించిన ఈ ప్రత్యేక ఆఫర్ కింద వినియోగదారులకు 1జీబీపీఎస్ స్పీడుతో అన్ లిమిటెడ్ డాటా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈనేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ జియో 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో యాజమాన్యం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో నెట్‌ వర్క్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో సహా మరికొన్ని ప్రధాన నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. దశల వారీగా రాష్ట్రంలోని మిగతా నగరాలు, పట్టణాలకు కూడా 5జీ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

కాగా జియోకు దేశవ్యాప్తంగా 42.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇక 4జీ సేవలను అందించటంలో తన ఆధిపత్యాన్ని చాటుకున్న జియో 5జీ వేగంలోనూ టాప్‌లోనూ నిలుస్తోంది. ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా విడుదల చేసిన డేటా ప్రకారం రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసిందట. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, వారణాసి ప్రాంతాల్లో జూన్ నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. కాగా దశల వారీగా దేశవ్యాప్తంగా అందరికీ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని జియో యాజమాన్యం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!