Bigg Boss Lahari: హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్

ఇదే పాపులారిటీతో బిగ్‌బాస్‌ సీజన్‌-5 లో అడుగుపెట్టింది. హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండకపోయినా తనదైన అందం, ఆటతీరుతో అభిమానుల మనసులు గెల్చుకుంది. తాజాగా లహరి హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది.

Bigg Boss Lahari: హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్
Ap 31 No Missing
Follow us
Basha Shek

|

Updated on: Oct 12, 2022 | 8:48 PM

బిగ్‌బాస్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో లహరి కూడా ఒకరు. న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె క్రమంగా సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులేసింది. విజయ్‌ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మళ్లీ రావా, పటేల్ సార్, అజ్ఞాతవాసి, పేపర్ బాయ్, శ్రీనివాస కల్యాణం, తిప్పరా మీసం, జాంబీ రెడ్డి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇదే పాపులారిటీతో బిగ్‌బాస్‌ సీజన్‌-5 లో అడుగుపెట్టింది. హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండకపోయినా తనదైన అందం, ఆటతీరుతో అభిమానుల మనసులు గెల్చుకుంది. తాజాగా లహరి హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. #Ap31 నెంబర్ మిస్సింగ్ అనే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు మూవీ మేకర్స్‌. కాగా ఇదే సినిమాతోనే చంటి హీరోగా వెండితెరకు ఇంట్రడ్యూస్‌ కానున్నాడు. కేవీఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్ బ్యానర్‌పై ఎమ్‌. నారాయణ స్వామి నిర్మిస్తున్నారు.

కాగా లహరి సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ కొరియో గ్రాఫర్‌ గణేశ్‌ మాస్టర్‌ లాంచ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త కథతో సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్న నటీనటులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అదేవిధంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమా స్టోరీ చాలా ఉత్కంఠగా ఉంటుంది. స్ట్రిప్ట్ చాలా బాగా కుదిరింది. ఈ సినిమా కోసం అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్‌ పని చేస్తున్నారు. ఈ నెల మూడోవారంలో వైజాగ్ పరిసర ప్రాంతంలో షూటింగ్ నిర్వహిస్తాం’ అని తెలిపారు. త్వరలోనే ఈసినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Lahari Shari (@lahari_shari)

View this post on Instagram

A post shared by Lahari Shari (@lahari_shari)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ