Tamil Nadu: టీచర్‌తో స్టూడెంట్‌ బ్రేకప్‌.. ఆమెకు మరొకరితో పెళ్లి ఫిక్స్‌.. ఆ విద్యార్థి ఏం చేశాడంటే?

సదరు విద్యార్థి ఓ టీచర్‌తో ప్రేమలో ఉన్నాడని, ఇటీవల ఆమెకు పెళ్లి కావడంతో దూరం పెట్టిందని, అందుకే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. దీంతో పోలీసులు టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Tamil Nadu: టీచర్‌తో స్టూడెంట్‌ బ్రేకప్‌.. ఆమెకు మరొకరితో పెళ్లి ఫిక్స్‌.. ఆ విద్యార్థి ఏం చేశాడంటే?
Teacher,student
Follow us
Basha Shek

|

Updated on: Oct 13, 2022 | 6:58 PM

ప్రేమ పేరుతో టీచర్‌ మోసం చేసిందని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో సంచలనంగా మారింది. ముందుగా చదువు అంటే ఇష్టం లేకనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడని అందరూ భావించారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు విద్యార్థి ఓ టీచర్‌తో ప్రేమలో ఉన్నాడని, ఇటీవల ఆమెకు పెళ్లి కావడంతో దూరం పెట్టిందని, అందుకే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. దీంతో పోలీసులు టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని అంబత్తూర్‌కు చెందిన కృష్ణకుమార్‌ ఓ ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో12 తరగతి చదువుతున్నాడు. గత మేలో పాఠశాల విద్యను పూర్తి చేసిన కృష్ణ కుమార్ ఇటీవల తన ఇంటిలోని బెడ్రూంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అందరూ చదువుకోవడం ఇష్టం లేకనే అతను సూసైడ్‌ చేసుకున్నాడని భావించారు. అయితే కుమారుడి మరణంపై అనుమానమొచ్చిన తల్లిదండ్రుల ఈ విషయంపై పోలీసుకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్ షర్మిళ, కృష్ణకుమార్‌ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని తేలింది. అయితే ఇటీవల షర్మిళకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. అప్పటి నుంచి ఆమె కృష్ణకుమార్‌కు దూరంగా ఉంది. మాట్లాడడం కూడా మానేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణకుమార్‌ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా మృతుడి సెల్‌ఫోన్‌లో టీచర్‌తో మాట్లాడిన వాయిస్‌ మెసేజులు, రికార్డులు ఉండడంతో పోలీసులు షర్మిళపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, పోక్సో తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టయిన షర్మిళని జైలుకు తరలించార. కాగా 12వ తరగతి చదువుతున్న విద్యార్థి మహిళా టీచర్‌తో ప్రేమ వ్యవహారం నడపడం, బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే